తెలంగాణ ఈఏపీ సెట్‌లో సత్తా చాటిన ఏపీ విద్యార్థులు
x

తెలంగాణ ఈఏపీ సెట్‌లో సత్తా చాటిన ఏపీ విద్యార్థులు

తెలంగాణ ఈఏపీ సెట్‌ ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్టుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను..


తెలంగాణ ఈఏపీ సెట్‌ ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్టుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 91,633 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. కాగా అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 89శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం నమోదైంది. అయితే ఈ పరీక్షల్లో టాప్ ర్యాంకర్స్‌గా ఏపీ విద్యార్థులే నిలవడం గమనార్హం.

తెలంగాణ ఈఏపీసెట్‌లో తెలంగాణ ఫస్ట్ ర్యాంకర్‌గా మదనపల్లెకు చెందిన ఆలూరి ప్రణీత నిలిచింది. మదనపల్లె, విజయవాడలో చదివిన ప్రణీత.. సొసైటీ కాలనీలో నివాసం ఉండే డాక్టర్ ఆలూరి శ్రీకర్, కల్యాణి దంపతుల ప్రోత్సాహంతో తెలంగాణ ఈఏపీ సెట్ పరీక్ష రాసినట్లు ప్రణీత వెల్లడించారు. గుండె వైద్య నిపుణులు కావాలన్నది తన ఆశయమని, దానిని సాధించడానికి కృషి చేస్తానని ప్రణీత వివరించింది.

ఈఏపీ సెట్‌లో టాపర్లు వీరే

ఈఏపీ సెట్‌లో ఇంజనీరింగ్ విభాగంలో శ్రీకాకుళం-పాలకొండకు చెందిన ఎస్ జ్యోతిరాదిత్య ప్రథమ స్థానం సాధించింది. రెండో స్థానంలో కర్నూలు-పంచలింగాలకు చెందిన హర్ష ఉన్నాడుు. కాగా అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లోప్రణీత తొలి స్థానం సాధించగారెండో ర్యాంకులో విజయనగరంకు చెందిన రాధాకృష్ణ నిలిచాడు.

Read More
Next Story