అమెరికాలో మరో తెలుగు కుర్రాడు మృతి..
x

అమెరికాలో మరో తెలుగు కుర్రాడు మృతి..

అమెరికాలో భారతీయులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కొంతకాలంగా తెగ వినిపిస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకటిగా మృత్యువాత పడిన ఘటనలు ఇక్కడ ఉంటున్న తల్లిదండ్రులకు కలవరపెడుతున్నాయి.


అమెరికాలో భారతీయులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కొంతకాలంగా తెగ వినిపిస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకటిగా మృత్యువాత పడిన ఘటనలు ఇక్కడ ఉంటున్న తల్లిదండ్రులకు కలవరపెడుతున్నాయి. ఉన్నత విద్య అనో.. ఉద్యోగం అనో అగ్రరాజ్యానికి పయనమైన తమ బిడ్డు ఎలా ఉన్నాడో అని కన్న పేగు కలత చెందుతుంది. వీటిలో కొన్ని ఘటనలకు ప్రామాదవ శాత్తు జరిగితే.. మరికొన్ని ఎవరో దుండగులు చేసిన దాడుల్లో జరుగుతున్నాయి. ఇటీవల తన విశేష సేవలతో అమెరికా ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకున్న వైద్యుడు రమేష్ కూడా ఇటువంటి దుండగుల దాడికి బలైన వారిలో ఒకరు. తాజాగా ఇప్పుడు మరో తెలుగు యువకుడు అగ్రరాజ్యంలో అసువులు బాశాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన రూపక్‌ రెడ్డి అనే యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం‌కు చెందిన రూపక్‌రెడ్డి.. ఎనిమిది నెలల క్రితం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు.హారిస్‌బర్గ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో‌ ఎంఎస్ చదువుతున్న రూపక్.. డెలవేర్‌లో నివాసం ఉంటున్నాడు. కాగా మంగళవారం సాయంత్ర రూపక్ తన స్నేహితులు ఐదుగురితో కలిసి స్థానికంగా పేరున్న పర్యాటక ప్రాంతం జార్జ్ లేక్‌ సందర్శనకు వెళ్లారు. అక్కడే బోటు‌పై షికారుకు వెళ్లారు. సరస్సు మధ్యలోకి వెళ్లగానే అక్కడ ఉన్న పెద్ద రాయి పైకి ఎక్కి ఫొటోలు దిగుదామని రూపక్ అన్నాడు. అందుకు అంతా ఓకే అనుకున్నాక.. రాయిపైకి ఎక్కి ఫొటోలు దిగుతున్నారు. అప్పుడే ఒక్కసారి బ్యాలెన్స్‌ తప్పి రూపక్, అతడి స్నేహితుడు రాజీవ్‌ నీళ్లలో పడిపోయారు. పక్కనే ఉన్న స్నేహితులు వెంటనే నీళ్లలోకి దూకి వారికి కాపాడే ప్రయత్నం చేశారు.

కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. రాజీవ్‌ను కాపాడగలిగినా.. రూపక్‌ను మాత్రం కాపాడలేపోయారు. దీంతో కళ్లెదుటే రూపక్ నీటమునిగుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో స్నేహితులు ఉండిపోయారు. అనంతరం జరిగిన ఘటనను అక్కడి పోలీసులకు వివరించడంతో రెస్క్యూ టీమ్ అక్కడకు హుటాహుటిన చేరుకుంది. నీటిలో మునిగిపోయిన రూపక్‌రెడ్డి మృతదేహాన్ని వెలికితీశారు అధికారులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిజంగా రూపక్‌కు జరిగింది ప్రమాదమేనా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని, రూపక్ స్నేహితులను విచారిస్తున్నామని వెల్లడించారు. అదే విధంగా రూపక్ మరణ వార్తను వారి కుటుంబీకులకు తెలియజేసినట్లు తెలిపారు.

తమ కుమారుడి మరణ వార్త విన్న రూపక్ తల్లిదండ్రులు కవిరాజ్ రెడ్డి, ధనవతి శోక సంద్రంలో మునిగిపోయారు. ఒక్కగానొక్క కొడుకంటూ గుండెలవిసేలా విలపిస్తున్నారు. రూపక్ మరణవార్తతో స్థానికంగా విషాధ ఛాయలు అలముకున్నాయి. కాగా రూపక్ మృతదేహాన్ని సొంత ఊరికి తీసుకురావడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వారు కోరుతున్నారు. తమ కొడుకు ఆఖరి చూపునైనా తమకు మిగల్చాలంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.

Read More
Next Story