హైదరాబాద్‌లో వెంకటరెడ్డిని అరెస్ట్‌ చేశారు. గురువారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గత జగన్‌ గవర్నమెంట్‌లో పని చేసిన అధికారులను కటకటాల వెనక్కి నెట్టే ప్రయత్నానికి దూకుడు పెంచింది. అందులో భాగంగా జగన్‌ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట కార్పొరేషన్‌(ఏపీఎండీసీ)కు మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ)గా వ్యవహరించిన వెంకటరెడ్డి మీద పూర్తి స్థాయి దృష్టి సారించింది. గత ఐదేళ్లల్లో మైనింగ్‌ వ్యవహారంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని వాటిని నిగ్గు తేల్చాని కంకణం కట్టుకుంది. అందులో భాగంగా నాడు ఏపీఎండిసీకి ఎండీగా వ్యవహరించిన వెంకటరెడ్డిపై కేసులు నమోదు చేసింది. హైదరాబాద్‌ వెళ్లి అదుపులోకి తీసుకొన్న ఏసీబీ అధికారులు ఆయను అరెస్టు చేయడంతో పాటు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో వెంకటరెడ్డికి వచ్చే నెల 10వ తేదీ వరకు రిమాండు విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో అధికారులు ఆయన్ను విజయవాడ కారాగారానికి తరలించారు. మరో వైపు వెంకటరెడ్డిని కస్టడీకి అప్పగించాలని ఏసీబీ అధికారులు పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ సోమవారం విచారణకు రానుంది.

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిని ఆంధ్రప్రదేశ్‌ ఏసీబీ అధికారులు గురువారం రాత్రి హైదరాబాద్‌ వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి ఆయనను విజయవాడకు తరలించారు. గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయంలో ఉంచి విచారించారు. అనంతరం ఆయనకు శుక్రవారం అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత ఆయనను గురువారం మధ్యాహ్నం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
శాండ్‌ కాంట్రాక్ట్‌ సంస్థలైన జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్, జీసీకేసీ, ప్రతిమ సంస్థలతో పాటు మరికొందరు వ్యక్తులతో కలిసి వెంకటరెడ్డి వేల కోట్ల కొల్లగొట్టేందుకు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఏసీబీ లాయర్లు ఏసీబీ న్యాయస్థానానికి వివరించారు. వెంకటరెడ్డి నేరపూరిత కుట్రల వల్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఖజానాకు రూ. 2,566 కోట్ల మేర నష్టం వచ్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో వెంకటరెడ్డికి రిమాండ్‌ విధించాలని కోరారు. అయితే వెంకటరెడ్డి తరఫు న్యాయవాది రిమాండు విధించవద్దని కోర్డును కోరారు. ఏసీబీ న్యాయవాదులు, వెంకటరెడ్డి న్యాయవాదుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు వెంకటరెడ్డికి వచ్చే నెల 10వ తేదీ వరకు రిమాండ్‌ రిమాండ్‌ విధిస్తూ తీర్పును వెలువరించారు.
Next Story