ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులకు స్వేచ్ఛ ఉందా? ముఖ్యమంత్రి చెప్పనట్లు చేయాల్సిందేనా? స్వతంత్రంగా మాట్లాడే మంత్రులు ఒకరిద్దరే గత ప్రభుత్వంలో ఉన్నారు. మరి నేడు..


రాను రాను ప్రజాస్వామ్య రాజకీయాల్లో నియంత ధోరణులు వస్తున్నాయి. మంత్రులకు సైతం మాట్లాడే స్వచ్ఛ లేకుండా పోయింది. ఏది మాట్లాడాలన్నా ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాల్సిందే. కనీసం మంత్రి శాఖలకు సంబంధించిన వివరాలు వెల్లడించాలన్నా సీఎం అనుమతి తీసుకోవాల్సిందే. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగింది ఇదే. మంత్రులు, ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలో వారి మనసుకు నచ్చిన మాట మాట్లాడేందుకు వీలుండేది కాదు. మంత్రులు ఏదైనా మాట్లాడాలనుకుంటే సీఎంవో నుంచి ఒక నోట్‌ వచ్చేది. ఆ నోట్‌లో న్న వివరాలు మాత్రమే వెల్లడించాలి. ఇక ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ కార్యక్రమాల గురించి వివరించేందుకు కానీ, రాజకీయాల గురించి మాట్లాడేందుకు కానీ మీడియాతో వైఎస్‌ జగన్‌ మాట్లాడిన సందర్బం లేదని చెప్పొచ్చు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన మాటగా జగన్‌ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేవారు. అందుకే ఎమ్మెల్యేలు, మంత్రుల్లో జగన్‌ అంటే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పైగా డబ్బలు ఉన్న వారిని ఎంపిక చేసి టికెట్లు ఇచ్చారు. కోటాను కోట్లు ఎన్నికల్లో ఖర్చు పెట్టించారు. తిరిగి ఆ డబ్బును రాబట్టుకునేందుకు నాయకులు నానా తంటాలు పడేవారు.

తెలుగుదేశం పార్టీ మిత్ర పక్షాల కూటమి అధికారం చేపట్టింది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారంతా డిపార్ట్‌మెంట్ల గురించి తెలుసుకునేందుకు సమీక్షలు నిర్వహించారు. ప్రెస్‌మీట్లు పెట్టి చేయాలనుకుంటున్నది, చేస్తున్నది మీడియాకు చెప్పారు. ప్రాంతీయ పార్టీలు కావడం వల్ల కొంత నిర్బంధం ఉండొచ్చేమో కాని కూటమిలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం గొంతు నొక్కేంతగా లేదని చెప్పొచ్చు. మాపై ఎటువంటి ఆంక్షలు లేవు. రాజకీయాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు పార్టీ లైన్‌ ప్రకారం మాట్లాడతాం. పథకాలు, ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి మా శాఖల్లో ఏమి చేయాలో, ఎలా చేయాలో అనే విషయాలు మీడియాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తామని మంత్రులు చెబుతున్నారు. ఇది సుభ పరినామంగా చెప్పొచ్చు. హోం మంత్రి అనిత చార్జి తీసుకోక ముందు నుంచే పోలీసుల తీరు మార్చుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. గత ప్రభుత్వంలో మాదిరి వ్యవహరిస్తే కుదరదని చెప్పారు. అంటే నాయకుడు ఆమెకు మాట్లాడే స్వచ్ఛ కొంత వరకు ఇచ్చారని చెప్పొచ్చు.
అసెంబ్లీ సమవేశాల నాటికి వైట్‌ పేపర్‌ విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులు, ప్రజలకు జరిగిన నష్టం గురించి వైట్‌ పేపర్లో వివరిస్తారు. ఈ విషయాను క్షణ్ణంగా పరిశీలించి వైట్‌ పేపర్‌ రూపొందించాలని ఇప్పటికే మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. పేరు చెప్పటానికి ఇష్టపడని మంత్రి ఒకరు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ మంత్రులకు కొంత మేరకు స్వచ్ఛ ఉంటుందని, వైఎస్సార్‌సీపీలో నియంత పోకడలు తప్ప మరేమీ కనిపించవని వ్యాఖ్యానించడం వివేషం. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు, మంత్రులను సీఎంవోలో ఉన్న కొందరు సలహా దారుల పేరుతో కట్టడి చేయడం, తాము చెప్పినట్లు చేయాలనే శాసించే స్థాయికి వెళ్లడం దౌర్భాగ్య మన్నారు.
ఇక జాతీయ పార్టీల్లో అయితే పరిస్థితులు వేరు. రాష్ట్రంలో జరిగే పరిణామాలపై ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని మంత్రులు మాట్లాడే వారు. మీ మంత్రి పలానా చోట ఇలా మాట్లాడారు కదా అని గతంలో జాతీయ పార్టీలో ముఖ్యమంత్రులుగా ఉన్న వారిని ప్రశ్నిస్తే నాకు ఇంకా సమాచారం లేదు. కనుక్కుంటాను అనే వారు. నేడు ఆ పరిస్థితులు లేవు. కమ్యునికేషన్‌ కూడా బాగా పెరిగింది. ఎప్పటికప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకునే వీలు ఉంది. అందువల్ల ఎవరు ఎక్కడ ఏమి వటట్లాడాలో ఒకరితో ఒకరు మాట్లాడుకుని మాట్లాడుతున్నారు.మంత్రులకు స్వేచ్ఛ ఉందా?ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులకు స్వేచ్ఛ ఉందా? ముఖ్యమంత్రి చెప్పనట్లు చేయాల్సిందేనా? స్వతంత్రంగా మాట్లాడే మంత్రులు ఒకరిద్దరే గత ప్రభుత్వంలో ఉన్నారు. మరి నేడు..
Next Story