వైఎస్‌ ఫ్యామిలీలో కుటుంబ కలహాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ పడిన అన్నా, చెల్లెలు తాజాగా కోర్టు మెట్లాక్కారు.


మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబంలో కుటుంబ కలహాలు మరో లెవల్‌కు చేరుకున్నాయి. మొన్నటి వరకు ప్రత్యర్థులుగా మారి ఎన్నికల్లో పోటీ పడిన అన్నా, చెల్లెలు తాజాగా కోర్టు మెట్లెక్కారు. ఆస్తుల వివాదాలే వీటి కారణంగా చర్చ జరుగుతోంది.

వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వెఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, ఆయన చెల్లి వైఎస్‌ షర్మిల, వారి తల్లి విజయలక్ష్మిలకు మధ్య ఆస్తుల వివాదం తారా స్థాయికి చేరుకున్నాయి. ఆస్తుల వివాదంపై జగన్‌ నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ గొడవలు మరో సారి తెరపైకి వచ్చాయి. క్లాసిక్‌ రియాల్టీ ప్రైవేట్‌ లిమిటెడ్, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ భారతీరెడ్డి పేర్లతో ఐదు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, వైఎస్‌ షర్మిలారెడ్డి, వైఎస్‌ విజయరాజశేఖర్‌రెడ్డితో పాటు జనార్దన్‌రెడ్డి చాగరి, యశ్వంత్‌రెడ్డి కేతిరెడ్డి, రీజనల్‌ డైరెక్టర్‌ సౌత్‌ ఈస్ట్‌ రీజియన్, రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ తెలంగాణను ప్రతివాదులుగా జగన్‌ తన పిటీషన్‌లో పేర్కొన్నారు. సెప్టెంబరు 3న ఒకటి, 11న మూడు, అక్టోబరు 18న ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. 2019 ఆగస్టు 21 ఎంవోయూ ప్రకారం తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిలకు కంపెనీ షేర్లు కేటాయించామని, అయితే వివిధ కారణాలతో కేటాయింపులు జరగలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ షేర్లను ఇప్పుడు విత్‌డ్రా చేసుకోవాలని నిర్ణయించినట్టు పేర్కొంటూ మరో పిటిషన్‌ దాఖలు చేశారు.

సెప్టెంబర్‌ 3 నాటి పిటిషన్‌కు సంబంధించి రాజీవ్‌ భరద్వాజ్, సంజయ్‌పురికి నోటీసులు జారీచేస్తూ తదుపరి విచారణ నవంబర్‌ 8కి ట్రైబ్యునల్‌ వాయిదా వేసింది. ఇప్పటి వరకు కేవలం వార్తలుగానే ఉన్న వీరి మధ్య ఆస్తుల తగాదాలు తాజాగా జగన్‌ పిటీషన్‌లతో తల్లి, సోదరితో జగన్‌కు ఆస్తుల వివాదం వాస్తవమనే చర్చ సాగుతోంది.
Next Story