
‘ఆశా’లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
‘ఆశా’లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐయూటీయూసీ అనుబంధ సంస్థ డిమాండ్ చేసింది. ‘ఆశా’లకు నెలకు రూ. 35 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆల్ ఇండియా యునైటెడ్ ట్రేడ్ యూనియన్ సెంటర్( AIUTUC) అనుబంధ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల ప్రథమ రాష్ట్ర మహాసభలు తిరుపతి పట్టణంలో జరిగాయి. ఈ సభల కార్యక్రమంలో భాగంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆశా కార్యకర్తలు బాలాజి కాలనీ, అంబేద్కర్ భవన్ నుంచి మహసభల ప్రాంతానికి ప్రదర్శన నిర్వహించారు.
అనంతరం జరిగిన సమావేశంలో ప్రారంభకులుగా హాజరైన AIUTUC రాష్ట్ర ఇంచార్జి ఎల్.సుధీర్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు ఐక్యమై మహాసభ నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. మిగతా కార్మిక సంఘాలు ఉద్యమాలను నామమాత్రంగా ఎలక్షన్ల ప్రయోజనాల కోసం నిర్వహిస్తున్నాయని అన్నారు. కానీ AIUTUC నిబద్దతతో కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తోందని, ముఖ్యంగా ఆశా వర్కర్లు రోజుకు 12 గంటలు పనిచేస్తురన్నారు.
చాలీచాలని జీతంతో జీవితాన్ని గడుపుతున్నారని కనీసం వారికి నెలకు రూ. 35,000 జీతంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ న్యాయబద్ధమైన డిమాండ్ ను సాధించాలంటే ఇతర స్కీం వర్కర్స్ తో పాటు కలిసి కేంద్ర ప్రభుత్వంపై సంఘటితంగా పోరాటం చేసి వత్తిడి చేయవలసి ఉంటుందని అన్నారు. అందుకనే AIUTUC అనుబంధంగా స్కీమ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SWFI) దేశవ్యాప్తంగా కార్మికుల డిమాండ్లపై ఉద్యమం నిర్వహిస్తున్నది. కావున ఆశా వర్కర్లు ఈ పోరాటానికి ముందుకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా SWFI జాతీయ అధ్యక్షురాలు TC.రమ మాట్లాడుతూ సమాజాన్ని నిర్మించాలంటే నూతన తరాన్ని రక్షించుకోవాల్సి ఉంటుందని, అందుకై మాతా, శిశు సంక్షేమానికై ఆశా వర్కర్లను స్కీం ను ఏర్పాటు చేశారని, కానీ నేటి ప్రభుత్వాలు ఆశా వర్కర్స్ ను అనేక ఇతర రాజకీయ పార్టీల కార్యక్రమాలలో కూడా భాగస్వామ్యం చేస్తూ వారిపై పని ఒత్తిడి కలిగిస్తున్నారని విమర్శించారు.
ఆశా వర్కర్లు సెలవులు లేకుండా నిరంతరం శ్రమిస్తూ కష్టపడుతున్న ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అంతవరకు కనీసం 35 వేలు జీతం ఇవ్వడం తెలియజేశారు. ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానికి వుందని గుర్తు చేశారు. ఈ మహాసభల అనంతరం ఆశా వర్కర్ల నూతన రాష్ట్ర కమిటిని ఎన్ను కున్నారు. గౌరవాధ్యక్షులుగా K. కుమార్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షురాలిగా S.జహీరా, ఉపాధ్యక్షురాలిగా K. పవనమ్మ, G. కవిత, రాష్ట్ర కార్యదర్శిగా CH. ప్రమీల, కార్యనిర్వాహక కార్యదర్శిగా T.మునేంద్ర, ,l కోశాధి కారిగా A.హరీష్ కమిటీ సభ్యులుగా 5 మందిని ఎన్నుకున్నారు.