తొమ్మిది ఎయిర్‌పోర్ట్‌లలో మొదలైన డిజీ సేవలు..
x

తొమ్మిది ఎయిర్‌పోర్ట్‌లలో మొదలైన డిజీ సేవలు..

ఏపీలోకి విమానాశ్రయాల సంఖ్యను డబులు చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్రి ఏవియేషన్ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు గతంలో వెల్లడించారు.


ఏపీలోకి విమానాశ్రయాల సంఖ్యను డబులు చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్రి ఏవియేషన్ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు గతంలో వెల్లడించారు. వీటిలో భోగాపురం విమానాశ్రయం ప్రధానం కానుందని ఆయన ఇప్పటికే చెప్పారు. కాగా తాజాగా ఈ విమానాశ్రయం ఎప్పుడు పూర్తవుతుందన్న అంశంపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఇప్పటికే ఈ విమానాశ్రయం పనులను శరవేగంగా కొనసాగిస్తున్నామని, పనుల పురోగతిని కూడా ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ విమానాశ్రయాన్ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని, మరో రెండుమూడేళ్లలో భోగాపురం విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. దీంతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి భూసేకరణ పనులను చేపట్టామని, రాష్ట్రప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ విమానాశ్రయాలకు కావాల్సిన భూములను గుర్తించే పనులు చేపట్టినట్లు చెప్పారు.

తొమ్మిది విమానాశ్రయాల్లో డిటీ సేవలు..

దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో డిజీ సేవలను ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర ఏవియేషన్ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం తొమ్మిది విమానాశ్రయాల్లో డిజీ యాత్ర సేవలను ప్రారంభించినట్లు ప్రకటించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 విమానాశ్రయాల్లో డిజీ యాత్ర సేవలు అందుబాటులో ఉన్నాయని, ఈ సేవలను ఇప్పటివరకు 3 కోట్ల మంది ప్రయాణికులు వినియోగించుకున్నారని తెలిపారు. ఈ డిజీ యాత్ర సేవల ద్వారా విమానాశ్రయాల్లో ప్రయాణికులు ప్రవేశించడం సులభతరం అవుతుంది. భవిష్యత్తులో మరిన్ని విమానా సేవలు అందుబాటులోకి రానున్నాయి. అక్టోబర్ 27 నుంచి విశాఖ-విజయవాడకు ఉదయం ఒక విమానం సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

డిజీ యాత్ర యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి..

డిజీ యాత్ర యాప్ ద్వారా ప్రయాణికులకు ఎన్నో లాభాలు ఉన్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ యాప్‌లో ప్రయాణికుల వివరాలు గోప్యంగా ఉంటాయని చెప్పారు. విమానాల్లో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఈ యాప్ ద్వారా ప్రయాణికులు సులభంగా విమాన ప్రయాణం చేయొచ్చు. దీంతో పాటుగా ఇదే విధంగా టెక్నాలజీతో కూడా మరిన్ని అత్యాధునిక సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, నిపుణలతో ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలపై చర్యలు జరుపుతూ వాటి పరిష్కారానికి కసరత్తులు చేస్తున్నామని కేంద్రమంత్రి చెప్పారు.

అభివృద్ధే లక్ష్యం

‘‘ఆంధ్రప్రదేశ్‌లోని విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 7 విమానాశ్రయాలు ఉన్నాయి. వాటి సంఖ్యను 14 చేసేలా చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే వీటిలో పలు ప్రాజెక్ట్‌లకు కేంద్ర ఓకే చెప్పేసింది. వీటితో పాటుగా పుట్టపర్తిలో ఉన్న ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్‌ను కూడా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. 500-700 ఎకరాల స్థలం ఉంటే చిన్న ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించొచ్చు. అలాంటిది పెద్ద ఎయిర్‌పోర్ట్ కావాలంటే కనీసం 3000 ఎకరాల భూమి కావాలి. ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణం కోసం ప్రస్తుతం భూసేకరణ చేస్తున్నాం’’ అని ఆయన గతంలోనే వెల్లడించారు.

గడువు పెరిగిందే..

అయితే భోగాపురం విమానాశ్రయం పూర్తి విషయంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై పలువురు వ్యంగ్యాస్రాలు సంధిస్తున్నారు. గతంలో 2026లోనే భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తి చేస్తామని, ఇక్కడి నుంచి విమానాయానాలను కూడా మొదలుపెడతామని చెప్పిన ఆయన ఇప్పుడు గడువు పెంచారంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఏపీలోని విమానాశ్రయాల అభివృద్ధిపై రాష్ట్ర సీఎం చంద్రబాబుతో జరిపిన చర్చల్లో.. ‘‘జూన్ 2026 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను పూర్తి చేస్తాం. ఏపీలో మిగిలిన ఎయిర్‌పోర్ట్‌ల విస్తరణ కూడా వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నాం’’ అని రామ్మోహన్‌నాయుడు అన్నారు. కానీ ఈరోజు మాత్రం మరో రెండు మూడు సంవత్సరాల్లో భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్తున్నారు. ఈ గడువు ఎందుకు పెరిగిందో ఆయన వివరించాలని చాలా మంది కోరుతున్నారు. అలాంటిదేమీ చెప్పకుండా ఇలా గడువు పెంచితే కేంద్ర చేతకాని తనం అనుకోవాలా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read More
Next Story