ఏలూరులోని బదంపూడిలో కిలోమీటర్ వరకు ఇన్ఫెక్టెడ్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. 10 కిలోమీటర్ల వరకు సర్వేలెన్స్ జోన్లుగా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. చాపకింద నీరులా విజృంభిస్తుండటంతో అటు అధికారులు, ఇటు ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. ఏలూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న ఒక వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆ వైద్య పరీక్షల్లో పాటిజివ్ అని రిపోర్టు వచ్చింది. సదరు వ్యక్తికి బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినట్లు రిపోర్టుల్లో తేలింది. ఈ విషయం క్షణాల్లో జిల్లా అంతా వ్యాపించింది. దీంతో ఏలూరు జిల్లా వాసులు వణికి పోతున్నారు.
ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లాలో హై అలెర్ట్‌ను ప్రకటించారు. పశుసంవర్థక శాఖ కార్యాలయంలో ఓ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. బర్డ్ ఫ్లూ సమాచారం తెలుసుకోవడం, ఆ ప్రాంతాలకు వెళ్లి మెడికల్ క్యాంపులు నిర్వహించేందుకు వీలుగా చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లా పరిధిలో ఎక్కడ కోళ్లు చనిపోతున్నా 9966779943 నంబర్‌కు సమాచారాన్ని అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కోళ్ల పెంపకానికి ప్రసిద్ధి. ఈ మండలంలో పెద్ద సంఖ్యలోనే కోళ్ల ఫామ్‌లు ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తుంటారు. అయితే వీటికి దగ్గరలో ఉంటున్న వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. దీంతో సదరు వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్థారించారు. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సదరు వ్యక్తికి వ్యాధి సోకిన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్థారణ అయిందని, దీంతో జిల్లాలో తొలి బర్డ్ ఫ్లూ కేసు తెరపైకొచ్చిందని, కేసు ట్రేస్ అయిన ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా వ్యైదశాఖ అధికారి డాక్టర్ మాలిని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిన వారికి వైద్య చికిత్సలు అందించేంకు అసవరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బర్డ్ ఫ్లూ వ్యాధి పట్ల జిల్లా వాసులు ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని, వైద్య పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఏలూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ కేసు నమోదైన నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి రంగంలోకి దిగారు. ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలను ఇన్ఫెక్టెర్, సర్వేలెన్స్ జోన్లుగా ప్రకటించారు. జిల్లాలోని బాదంపూడిలో కిలోమీటర్ పరిధి మేరకు ఇన్ఫెక్టెడ్ జోన్‌గా ప్రకటించిన జిల్లా అధికారులు 10 కిలోమీటర్ల వరకు సర్వేలెన్స్ జోన్లుగా ప్రకటించారు. ఈ జోన్లపైన ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇన్ఫెక్టెడ్ జోన్‌లో ఉన్న కమర్షియల్ కోళ్ల ఫారమ్‌లోని కోళ్లతో పాటు నాటు కోళ్లను కూడా పూర్తిగా కిల్లింగ్ చేసి, తర్వాత ఖననం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
Next Story