బీజేపీ అభ్యర్థులు వీరే.. ఈవేళో రేపో ప్రకటన
x
Source: Twitter

బీజేపీ అభ్యర్థులు వీరే.. ఈవేళో రేపో ప్రకటన

ఏపీ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థులకు సంబంధించి పురందేశ్వరి.. పార్టీ పెద్దలకు ప్రాథమిక జాబితాను అందించారు. అందులో ఎవరెవరు ఉన్నారంటే..


ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేయడానికి టీడీపీ-బీజేపీ-జనసేన అంగీకరించాయి. కేంద్ర మంత్రి షేకావత్‌తో జరిగిన సమావేశంలో పురందేశ్వరి అభ్యర్థుల ప్రాథమిక జాబితాను ఆయనకు అందించారు. దాదాపు పురందేశ్వరి అందించిన అభ్యర్థులను ఖరారు చేసే పరిస్థితులు ఉన్నాయి.. బీజేపీ పోటీ చేయనున్న అసెంబ్లీ స్థానాల్లో పురందేశ్వరి ఇచ్చిన జాబితాలో విశాఖ ఉత్తరం నుంచి విష్ణుకుమార్ రాజు, జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, పి. గన్నవరం నుంచి అయ్యాజీ పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ మాధవ్, సీనియర్ నేత సీతారామాంజనేయ చౌదరి కూడా అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలని కోరుతున్నారు. అదే విధంగా కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ అల్లుడు సాయిలోకేష్.. మదనపల్లె లేదా రాజంపేట నుంచి ఎన్నికల బరిలో నిలవాలని ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూడా ఆయనకు టికెట్ ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తోంది.

లోక్‌సభ అభ్యర్థులు వీరే!

ఇక లోక్‌సభ స్థానలకు పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల జాబితాను కూడా రాజమహేంద్రవరం నుంచి పురందేశ్వరి, తిరుపతి నుంచి మునిసుబ్రహ్మణ్యం, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు, అరకు నుంచి కొత్తపల్లి గీతల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో నరసాపురం సహా మిగిలిన స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది. మరో రెండు మూడు రోజుల్లో బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయొచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ప్రచారాన్ని ముమ్మరం చేసే పనిలో పార్టీలు

ప్రస్తుతం టీడీపీ, జనసేన కూడా తమ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పడ్డాయి. ఒక్కసారి మూడు పార్టీల అభ్యర్థుల ఎంపిక పూర్తయితే కలిసికట్టుగా ప్రచార రథాలను కదిలించడానికి ఆ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే ప్రచారాన్ని ముమ్మరంగా సాగించడానికి మూడు పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి, ఎక్కడెక్కడ రోడ్‌షోలు నిర్వహించాలి అన్న ప్రణాళికలు రచించడంపై కూడా మూడు పార్టీలు దృష్టి పెట్టాయి. మేనిఫెస్టోపై కూడా మూడు పార్టీల నేతలు సంయుక్తంగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం.

Read More
Next Story