బాలీవుడ్ నటి సమంతా.. మా తిరుపతి కోడలే..
x

బాలీవుడ్ నటి సమంతా.. మా తిరుపతి కోడలే..

రాజేష్ తల్లిదండ్రులు టీటీడీలో ఏమి చేస్తుంటారు..?


సినీకథాయకి సమంత వివాహం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఆమె తిరుపతి కోడలు ఎలా అయ్యారబ్బా? సమంతను రెండో పెళ్లి చేసుకున్న రాజేష్ (రాజ్) నిడుమోరుకు తిరుపతితో ఉన్న అనుబంధం ఏమిటి? ఆయన తల్లిదండ్రులు తిరుపతిలో ఏమి చేస్తున్నారు? అని నెటిజన్లు (Netizens) తీవ్రంగా సెర్చ్ చేస్తున్నారు.

"తిరుపతి అబ్బాయిని పెళ్లి చేసుకుని సమంత మా ఊరి కోడలు అయింది" అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వారిద్దరి వివాహంతో రాజ్ గా పేరుమార్చుకున్న రాజేష్ తల్లిదండ్రులు టీటీడీ ( TTD) ఉద్యోగులనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. వారి నివాసం కోసం మీడియా గాలింపులోకి దిగింది.
శ్రీదేవికి పుట్టిల్లు
సినీనటి శ్రీదేవికి కూడా తిరుపతితో అనుబంధం ఉంది. శ్రీదేవి తిరుపతిలో జన్మించలేదు. కానీ, ఈ ప్రాంతంతో విడదీయలేని బంధం ఉంది. శ్రీదేవి పూర్వీకులు తిరుపతిలో నివసించారు. ఆ తరువాత తమిళనాడుకు వలస వెళ్లారు. ఆమె తల్లి రాజేశ్వరి మరణం తరువాత చిన్నమ్మలు అనసూయమ్మ, మునిసుబ్బమ్మ స్వయంగా శ్రీదేవీ ఆలనా పాలనా చూశారు. ఆమె దుబాయ్ లో మరణించే వరకు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడల్లా పిన్నమ్మలు, బాబాయ్ తో కలిసి మాట్లాడి వెళ్లేవారు. ఈ విషయం పక్కకు ఉంచితే..
సమంతకు మెట్టి ఇల్లు..

తిరుపతికి చెందిన రాజ్ నిడుమోరుతో కలిసి టాలీవుడ్ కథానాయకి సమంత ఏడడుగులు వేశారు. ఈ నెల ఒకటో తేదీ తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రం ( Isha Yoga Center in Coimbatore) లోని లింగభౌరవీదేవి సన్నిధిలో పురాతన యోగ సంప్రదాయ పద్ధతిలో "భూత శుద్ధి వివాహం" పద్ధతిలో సమంతను రాజ్ నిడుమోరు వివాహం పరిమిత సంఖ్యలో హాజరైన ఆత్మీయుల మధ్య జరిగింది. సమంతకు వివాహం చేయించడంలో ఆమె స్నేహితురాలు ప్రధానపాత్ర పోషించారనే వార్తలు వినిపిస్తున్నాయి. దంపతులైన సమంత, రాజ్ నిడుమోరి తో కలిసి ఆమె కూడా గ్రూప్ ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు వారి సామాజిక మాధ్యమాల్లో పోస్టు కూడా చేశారు.
ఇద్దరిదీ రెండో పెళ్లే..
సినీ కథానాయిక సమంతను రెండో పెళ్లి చేసుకున్న రాజ్ నిడుమోరికి కూడా రెండో వివాహమే. మొదటి భార్యకు ఆయన కూడా విడాకులు ఇచ్చారు. రాజ్ మాజీ భార్య శ్యామలడే ఇన్స్ట్రా గ్రాంలో స్పందించారు.
నాపై చూపించిన దయకు, నాకు విషెస్ అందించిన వారిలో నాలుగు మంచి మాటలు చెప్పనందుకు ధ్యాంక్యూ అని స్పందించారు.
ఇంతకీ రాజ్ ఎవరు..?
సినీ హీరాయిన్ సమంతను వివాహం చేసుకున్న రాజ్ నిడుమోరు అనేది సినీ అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది. ఆయన తెలుగు వ్యక్తి అని తెలియడంతో రాజ్ ఎక్కడి వారనేది శోధించేందుకు సినీ అభిమానుల్లో మరింత ఆసక్తి ఏర్పడింది.
తిరుపతి నుంచి ప్రస్థానం..
సిల్వర్ స్క్రీన్ పై రాణించడానికి రాజ్ నిడుమోరు తిరుపతి నుంచే తన ప్రస్థానం ప్రారంభించి, బాలీవుడ్, ఓటీటీ ప్లాట్ ఫాంను శాసించే స్థాయికి ఎదిగారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తిరుపతిలో జన్మించిన రాజ్ నిడుమోరు బాల్యం కొంతకాలం ఆధ్యాత్మిక నగరంలోనే సాగింది. ఆయన కుటుంబం తిరుమల శ్రీవారి సేవలో ఉండడం గమనార్హం. రాజ్ పాఠశాల విద్య వైజాగ్ లో జరిగినట్టు తెలుస్తోంది. చిన్ననాటి నుంచి చదువులో చురుకుగా ఉండే రాజ్ నిడుమోరు తిరుపతి నగరంలోని శ్రీవేంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజీలో 1994 బ్యాచ్ విద్యార్థిగా మెకానికల్ ఇంజినీరింగ్ లో బీటెక్ పూర్తి చేసిన ఆయన ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లారు. అంతకుముందు పుట్టపర్తి సత్యసాయి విద్య సంస్థల్లో ఇంటర్ వరకు చదివారని సమాచారం. సినిమారంగంపై కూడా ఆసక్తి ఉన్నప్పటికీ తన కేరీర్ పై ఆయన దృష్టి నిలిపినట్లు కనిపిస్తోంది. అమెరికాలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేసిన రాజ్ అమెరికాలోనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేశారు. అమెరికాలో ఉండగానే, ఆయన స్నేహితుడు డికె. కృష్ణ తో కలిసి సినిమాలపై దృష్టి సారించాడు.
రాజ్.. డికే..
తెలుగు సినిమా రంగంలో పరుచూరి బ్రదర్స్, రాజ్, కోటి అనేది ఓ బ్రాండ్ వారు స్వయాన సోదరులు కూడా. అయితే, రాజ్ నిడుమోరు తన స్నేహితుడు కృష్ణ డికేతో కలిసి సినిమాలు తీయడం ప్రారంభించారు. దీంతో వారిద్దరు రాజ్ అండ్ డీకే బ్రాండ్ సాధించారని సినీవర్గాలు చెబుతాయి. వారిద్దరి సారధ్యంలోనే 2003లో ఫ్లేవర్స్ ( Flavors), 2009లో '99' వంటి సినిమాలతో రాజ్, డికే సినీనిర్మాణ ప్రస్థానం ప్రారంభించారు. కానీ, వారిద్దరికీ ప్రత్యేక గుర్తింపు తెచ్చిన చిత్రం షోర్ ఇన్ ది సిటీ (Shore in the City) సినిమానే అని బాలీవుడ్ కథనం. ఆ తరువాత కూడా వారిద్దరి కాంబినేషన్ లో జాంబీ కామెడీ ( Zombie Comedy), గో గోవా గాన్ ( Go Goa Gone), ఏ జెంటిల్ మ్యాన్ ( A Gentleman)వంటి సినిమాలతో బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సాధించారనేది సినీవర్గాల సమాచారం.
సమంతతో పరిచయం ఎలా..?
సినీదర్శకుడిగా మారిన రాజ్ నిడుమోరు కెరీర్ లో ది ఫ్యామిలీ మ్యాన్ (The Family Man) అనే అమెజాన్ ప్రైమ్ సిరీస్ మలుపు తిప్పినట్లు చెబుతున్నారు. ఓటీటీ ప్లాట్ ఫాంపై రికార్డు సృష్టించిన ఈ సిరీస్ లో రెండో సీజన్ లో రాజీ పాత్రకు సమంతను ఎంపిక చేయడం వల్ల వారిద్దరి మధ్య పరిచయానికి బీజం పడినట్లు సినీవర్గాల టాక్. ఆ పరిచయం వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారడానికి కూడా కారణం లేకపోలేదు.
అక్కినేని నాగచైతన్యతో సమంతకు 2017లో వివాహమైంది. వారిద్దరి మధ్య వచ్చిన విబేధాల కారణంగా 2021 సమంత విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వ్యక్తిగత సమస్యలు, అనారోగ్యం ఇతరత్రా ఇబ్బందులు తలెత్తినా సమంత ఒంటరిగానే జీవనం సాగిస్తూ, సినిరంగంలో నిలబడ్డారు. ఈ ఒంటరితనంలోనే రాజ్ నిడుమూరుతో ఏర్పడిన పరిచడం వారిద్దరిని దంపతులను చేసింది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే, రాజ్ కూడా 2022లో తన మొదటి భార్య శ్యామలి దే తో విడాకులు తీసుకున్నారు.
తిరుపతి కోడలు...

గోవాకు చెందిన సమంత బాలీవుడ్ సినీరంగంపై తనదైన శైలి నటనతో ప్రత్యేక గుర్తింపు సాధించారు. తిరుపతిలో పుట్టి, పెరిగి, చదువుకున్న రాజ్ నిడుమోరును వివాహం చేసుకున్న సమంత తిరుపతి కోడలయ్యారు. రాజ్ నిడుమోరు తండ్రి తిరుపతి తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తున్న ఎస్వీ గోశాలలో ఉద్యోగిగా పనిచేశారు. తల్లి రాజేశ్వరి శ్రీపద్మావతి మహిళా కళాశాలలో అధ్యాపకురాలు ( Sri Padmavati Women's College )గా పనిచేశారనే విషయం కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. రాజేష్ (రాజ్) తల్లిదండ్రులు ఎక్కడున్నారనే విషయం తెలుసుకునేందుకు తిరుపతి మీడియా రంగంలోకి దిగింది.
Read More
Next Story