రేపే బొత్స సత్యనారాయణ నామినేషన్.. గెలుపే లక్ష్యం..
x

రేపే బొత్స సత్యనారాయణ నామినేషన్.. గెలుపే లక్ష్యం..

స్థానిక సంస్థల ఉపఎన్నికలకు విశాఖ సిద్ధమవుతోంది. వీటిలో ఎలాగైనా గెలవాలని వైసీపీ కసరత్తులు చేస్తోంది. ఈ ఉపఎన్నికల్లో ఎవరిని నిలబెట్టాలో అర్థం కాక కూటమి ప్రభుత్వం కుయ్యమొర్రో అంటోంది.


స్థానిక సంస్థల ఉపఎన్నికలకు విశాఖ సిద్ధమవుతోంది. వీటిలో ఎలాగైనా గెలవాలని వైసీపీ కసరత్తులు చేస్తోంది. ఈ ఉపఎన్నికల్లో ఎవరిని నిలబెట్టాలో అర్థం కాక కూటమి ప్రభుత్వం కుయ్యమొర్రో అంటోంది. ఇదే మంచి ఛాన్స్‌గా తమ విజయం కోసం బొత్స సత్యనారాయణ మాస్టర్ ప్లాన్స్‌ను రచిస్తున్నారు. ఆరునూరైనా సరే విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో విజయకేతం ఎగరేయాలని, విశాఖలో పార్టీని మళ్ళీ బలోపేతం చేసే విధంగా ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖలోని కార్పొరేటర్లతో ఆయన సమావేశమయ్యారు. తన విజయానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ నెల 12న తాను నామినేషన్ దాఖలు చేస్తున్నానని, విశాఖ ఉపఎన్నికల్లో వైసీపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఉపఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కార్పొరేటర్లతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ దశలవారీగా సమావేశమవుతున్నారు. పార్టీ బలోపేతం అంతా కలిసి పనిచేయాలని పిలుపిచ్చారు. అదే విధంగా అసెంబ్లీలో ఎదుర్కోలేకపోయినా.. శాసనమండలిలో వైసీపీ బలమేంటో ఎన్‌డీఏ కూటమికి చూపించాలని అన్నారు. అందుకోసం ఈ ఉప ఎన్నికలో తన విజయానికి సహకరించాలని అందరినీ కోరారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు సహా పలువురు కీలక నేతు పాల్గొన్నారు.

గెలిచేది బొత్సనే: మాజీ మంత్రి

విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బొత్స సత్యనారాయణే గెలుస్తారని, అందులో సందేహం లేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. ఎన్‌డీఏ ఎన్ని కుట్రలు పన్నినా వైసీపీ గెలుపును అడ్డుకోలేదని వ్యాఖ్యానించారు. ఈ ఉపఎన్నికల్లో ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలుపు బొత్సదేనని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానికేతరుడు అయిన బొత్స ఎలా పోటీ చేస్తారంటూ వస్తున్న వాదనలపై కూడా ఆయన ఆయన ఘాటుగా స్పందించారు. బొత్స స్థానికేతరుడు అయితే.. ఇక్కడ పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే సీఎం రమేష్ ఎక్కడి వారు అని ప్రశ్నించారు.

విశాఖ ఉప ఎన్నికలపై ఫుల్ ఫోకస్

విశాఖ స్థానిక సంస్థల ఉపఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇవి హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని అధికార, విపక్ష వర్గాలు కసరత్తులు చేస్తున్నాయి. ఈ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ 13 వరకు కొనసాగనుంది. 14 నుంచి 16 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఈ నెల 30 ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరగనుంది. సెప్టెంబర్ 3న కౌంటింగ్ జరిగిన ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఉపఎన్నికల బరిలో వైసీపీ తరపున బొత్స సత్యనారాయణ బరిలోకి దిగనుండగా కూటమి తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.

Read More
Next Story