TIRUMALA | 20న బ్రేక్ దర్శనాలు రద్దు
x

TIRUMALA | 20న బ్రేక్ దర్శనాలు రద్దు

వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ పూర్తయింది. 20వ తేదీ నుంచి సర్వదర్శనం ప్రారంభం కానుంది.


తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ఈ నెల 19వ తేదీతో పూర్తి కానున్నాయి. అదే రోజు సాయంత్రం ద్వారాలు మూసివేస్తారు. టోకెన్ల జారీ ప్రక్రియ శుక్రవారంతో ముగిసినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. దీంతో ఈ నెల 20వ తేదీ నుంచి గతంలో తిరుమలలో సర్వదర్శనం ప్రారంభం కానున్నది. టోకెన్లతో అవసరం లేకుండా క్యూలో వెళ్లి శ్రీవారిని యథావిధిగా సర్వదర్శనం చేసుకోవచ్చు.

తిరుమలలో జనవరి 19న వైకుంఠ ద్వారాలు మూసివేయనున్నారు. దీంతో ఇప్పటి వరకు టోకెన్లు తీసుకున్న వారికి వైకుంఠద్వార దర్శనం ముగుస్తుంది. ఆ రోజు ఆదివారం కావడం వల్ల యాత్రికుల రద్దీ అధికంగా ఉంటుందని టీటీడీ అధికారులు అంచనా వేశారు. దీంతో సోమవారం నుంచి సర్వదర్శనానికి యాత్రికులు క్యూలో వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలని అధికారులు సూచించారు.
శ్రీవాణి, బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో ఆదివారం యాత్రికుల రద్దీ ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు. సంక్రాంతి సెలవులు ముగియనున్నాయి. దీనికి తోడు వైకుంఠ ద్వార దర్శనాలకు కూడా అదే రోజు చివరిది. అందువల్ల జనవరి 20వ తేదీ శ్రీవారి దర్శనానికి ముందు రోజు అంటే 19వ తేదీ ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టిక్కెట్లు జారీ చేయడం లేదని టీటీడీ సమాచార విభాగం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. 20వ తేదీ ప్రొటోకాల్ దర్శనాలు మినహా బ్రేక్ దర్శనాలు రద్దు చేశామన్నారు. అందువల్ల ముందు రోజు 19వ తేదీ విఐపి బ్రేక్ దర్శానికి సిఫార్సు లేఖలు స్వీకరించరని వివరించారు.
Read More
Next Story