రెండు తెలుగు రాష్ట్రాల్లో రామ్ గోపాల్ వర్మ కేసుల వ్యవహారం సంచలనంగా మారింది. ఏమి జరుగుతుందో అని తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో రామ్ గోపాల్ వర్మ కేసుల వ్యవహారం సంచలనంగా మారింది. రామ్ గోపాల్ వర్మ కేసులో ఏమి జరుగుతుందో అని తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకేసుల వ్యవహారం సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు వ్యవహరిస్తున్నతీరు, వారిపై రామ్ గోపాల్ వర్మ బదులిస్తున్న తీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. తనపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు పెడుతున్న కేసులను రద్దు చేయాలని తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ అంశం మరో సారి హాట్ టాపిక్ గా మారింది. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై కేసులు నమోదు చేస్తున్నారని వీటిని రద్దు చేయాలని పిటీషన్ దాఖలు చేశారు.
చట్ట విరుద్ధంగా ఒక అంశంపై ఇన్నికేసులు పెట్టడం సమంజసం కాదని తన పిటీషన్ లో కోరారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై ఏపీలో రాష్ర్ట వ్యాప్తంగా కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధమని, ఇకపై తనపై కేసులు నమోదు చేయకుండా పోలీసులను ఆదేశించాలని ఆర్జీవీ తన పిటీషన్ లో కోర్టును కోరారు. ఆర్జీవీ మరో సారి హైకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది వరకు ఇదే కేసులపై కోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ ఇది వరకు పిటీషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు ఆ పిటీషన్ ను తరస్కరించింది. తాజాగా దాఖలు చేసిన పిటీషన్ ను కోర్టు స్వీకరించింది. దీనిపై గురువారం విచారణ చేపట్ట నుంది. ఈ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గురువారం ఆర్జీవీ పిటీషన్ పై విచారణకు స్వీకరించిన కోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరడంతో, ఈ అభ్యర్థనను అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఒకే అంశంపై పలు చోట్ల కేసులు పెడుతున్నారంటూ రామ్ గోపాల్ వర్మ తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.
అసలు ఏమి జరిగిందంటే.. వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లపై అభ్యంతరకర పోస్టులు సోషల్ మీడియాలో పెట్టారని ఆరోపిస్తూ టీడీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లోను, గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్ లోను, ఇంకా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్జీవీపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆర్జీవీకి నోటీసులు కూడా అందించారు. హైదరాబాద్ లోని ఆయన ఇంటికెళ్లి మరీ మద్దిపాడు పోలీసులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు అందజేసి వచ్చారు. అయితే ఆర్జీవీ పోలీసుల విచారణకు హాజరు కాలేదు.
ఈ నేపథ్యంలో ఆర్జీవీ పరారీలో ఉన్నారని, పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారని, ఆర్జీవీ కోసం పోలీసుల టీమ్ లు గాలింపులు చేపట్టారని మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు ఆర్జీవీ ఒక వీడియోను విడుదల చేశారు. తాను భయపడ లేదని, మంచం కింద దాక్కొని ఏడవడం లేదని స్పష్టం చేశారు. తాజాగా హైకోర్టును ఆశ్రయించారు.