సాక్షి దినపత్రిక ఎడిటర్ వి మురళిపై విజయవాడలో పోలీస్ కేసు నమోదైంది. పడమట పోలీసు స్టేషన్‌లో ఒక న్యాయవాది కేసు పెట్టారు.
సాక్షి దినపత్రిక ఎడిటర్ వి మురళిపై విజయవాడకు చెందిన గుడిపాటి లక్ష్మినారాయణ అనే న్యాయవాది కేసు పెట్టారు. ‘ముంపులోనూ మేసేశారు’ అంటూ సాక్షిలో విజయవాడ వరదలపై ఒక కథనం వచ్చింది. ఈ కథనంపై న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఎడిటర్‌పై కేసు నమోదు చేయడం భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడేనని పలువురు జర్నలిస్ట్ నాయకులు వ్యాఖ్యానించారు. ఈ కథనానికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తి ఎలా కేసు పెడతాడని, పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారని సాక్షి వాదిస్తోంది. సుప్రీ కోర్టు ఈనెల 4న ఇచ్చిన ఒక తీర్పును కూడా ఉదహరిస్తూ సాక్షి శుక్రవారం ఒక కథనం ప్రచురించింది. ‘పత్రికా స్వేచ్ఛపై రెడ్ బుక్ పడగ’ అంటూ కథనం రాసింది. ఆ కథనంలో పలువురి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కావాలని పథకం ప్రకారం భయపెట్టే కార్యక్రమం చేపడుతున్నారని కథనంలో పేర్కొన్నారు. తిరుపతిలో కూడా సాక్షిపై పోలీసులకు కూటమి నేతలు ఫిర్యాదు చేయించినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు.