దివ్వల మాధురిపై కేసు నమోదు.. ఎమోషనల్ అయిన దువ్వాడ శ్రీనివాస్
x

దివ్వల మాధురిపై కేసు నమోదు.. ఎమోషనల్ అయిన దువ్వాడ శ్రీనివాస్

దివ్వల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ రోజు కూడా మరో కీలక మలుపు తీసుకుంది. తాజాగా పోలీసులు దివ్వల మాధురిపై కేసు నమోదు చేశారు.


దివ్వల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ రోజు కూడా మరో కీలక మలుపు తీసుకుంది. తాజాగా పోలీసులు దివ్వల మాధురిపై కేసు నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకోవాలన్న ఉద్దేశంతో పలాస లక్ష్మీపురం టోల్‌గేట్ దగ్గర ఆగిఉన్న కారును ఢీకొట్టిన ఘటనకు సంబంధించి మాధురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమెపై కేసు నమోదు చేయడానికి బలమైన కారణమే ఉందని పోలీసులు చెప్తున్నారు. అయితే దువ్వాడ వాణి తన పిల్లలపై చేస్తున్న ఆరోపణలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నానని, అందుకే టెక్కలి నుంచి బయలుదేరి వచ్చానని మాధురి వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే వైద్యాన్ని కూడా నిరాకరించారామే. తనకు వైద్యం వద్దని, తనను చనిపోనివ్వండంటూ ఆసుపత్రిలో సీన్ క్రియేట్ చేశారు. ఆఖరికి తనను చావకుండా చూసి దేవుడు కూడా తనను మోసం చేశాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాధురి.

కేసు ఎందుకంటే..

పలాస జాతీయ రహదారిపై ఆగి ఉన్న కారును మాధురి నడుపుతున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. మాదురికి గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించిన తర్వాత తనకు జరిగింది ప్రమాదం కాదని మాధురి స్వయంగా చెప్పారు. తానే కావాలని కారును ఢీకొట్టానని, ఆత్మహత్య చేసుకోవాలనే తాను ఇలా చేశానని చెప్పారు. వాణి ఆరోపణలు తట్టుకోలేకే తాను ఇలా చేశానంటూ చెప్పారు. ఈ విషయంలోనే నిర్లక్ష్యంతో ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా వ్యవహరించారని ఆమెపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నూతన భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 125 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అందుకే ఆత్మహత్యకు పాల్పడింది: దువ్వాడ శ్రీనివాస్

దివ్వల మాదురి ఆత్మహత్యకు పాల్పడటంపై దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. ఆమెను వ్యక్తిగత హననం చేయడంతోనే ఈ దారుణానికి పాల్పడిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెపై చేసును ఆరోపణలు తట్టుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని అన్నారు. ఎంతలా ఆరోపణలు చేస్తే ఒక మనిషి తన జీవితాన్ని ముగించుకోవాలని అనుకుంటారో ఆలోచించుకోవాలని అన్నారు. ‘‘ఒక మనిషిని ఇంతలా బాధించాల్సిన అవసరం ఏముంది. వ్యక్తిగత హననం చేశారు. వారు మాటలు తట్టుకోలేకే మాధురి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు’’ అని అన్నారు.

డ్రామా ఏమీ కాదు

‘‘మాధురి ఆత్మహత్యాయత్నం డ్రామా అని కూడా చాలా మంది ప్రచారం చేస్తున్నారు. కానీ అటువంటిదేమీ లేదు. ఆమెపై వస్తున్న ఆరోపణల వల్ల ఆమె పుట్టింటికి, మెట్టినింటికి దూరమయ్యారు. ఆ సమయంలో కూడా కాకుల్లో పొడుతున్న ఆరోపణలను తట్టుకోలేక తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. దాంతో ఏం చేస్తున్నారో కూడా అర్థంకాని స్థితికి చేరుకుని తన జీవితాన్ని ముగించుకోవాలని భావించే ప్రమాదానికి పాల్పడ్డారు. గతంలో కూడా మాధురి ఆత్మహత్యకు పాల్పడినప్పుడు నేను ధైర్యం చెప్పారు. ఇటీవల కొంత కాలంగా కొందరు తనను వ్యక్తిగతంగా హననం చేస్తున్నారని చెప్పుకుని మాధురి ఎంతో బాధపడింది. మాధురి తలకు గాయమైంది. ఏడాదిలో ఏమైనా జరగొచ్చని వైద్యులు అంటున్నారు. ఆందోళనగా ఉంది’’ అని దువ్వాడ ఎమోషనల్ అయ్యారు.

Read More
Next Story