ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. కేసుల నమోదు పర్వం టాలీవుడ్‌కు పాకింది.
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై పోలీసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు వైఎస్‌ఆర్‌సీపీకి సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తోన్న కూటమి ప్రభుత్వం, తాజాగా సీనీ ప్రముఖులపై కూడా కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై కేసు నమోదు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో పాటు వారి కుటుంబ సభ్యులపై వారి వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో రామ్‌గోపాల్‌వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు తాను దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ సమయంలో నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులపై అభ్యంతరకర పోస్టులు పెట్టారని రామ్‌గోపాల్‌వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణకు రామ్‌గోపాల్ వర్మ హాజరు కావలసి ఉంది. హైదరాబాద్‌లో ఉన్న రామ్‌గోపాల్ వర్మకు నోటీసులు అందించనున్నారు. అయితే పోలీసులే స్వయంగా రామ్‌గోపాల్ వర్మకు నోటీసులు అందించాలని నిర్ణయించారు. ఆ మేరకు ఎస్‌ఐ శివరమయ్య ఆధ్వర్యంలోని పోలీసుల ప్రత్యేక బృందం మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరింది. బుధవారం రామ్‌గోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు అందజేయనున్నారు.