ఎన్నికల మందు క్యాస్ట్ సెన్సస్ వద్దు
x

ఎన్నికల మందు క్యాస్ట్ సెన్సస్ వద్దు

వాలంటీర్లతో కుల గణన సమగ్ర సర్వే నిర్వహించడం ద్వారా అధికార పార్టీకి లబ్ది చేకూరుతుంది. దీనితో కులగణన లక్ష్యం నెరవేరదు: జన చైతన్య వేదిక



ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభకు లోక్ సభకు , ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కుల గణనసమగ్ర సర్వేను వాలంటీర్లతో నిర్వహించడం సహేతుకం కాదని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి ఒక ప్రకటన తెలిపారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించుకున్నామని పదేపదే ముఖ్యమంత్రి , మంత్రులు పేర్కొంటున్న నేపథ్యంలో అదే వాలంటీర్లతో కుల గణన సమగ్ర సర్వే నిర్వహించడం ద్వారా అధికార పార్టీకి లబ్ది చేకూరుతుందని వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి వివరించారు.


వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి



కుటుంబాల ఆర్థిక , సామాజిక, కులాల సమాచారం అంతా అధికార పార్టీ శ్రేణులకు అందుబాటులోనికి రావడం ద్వారా రాబోవు ఎన్నికలు స్వచ్ఛంగా స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగటానికి అవరోధాలుగ మారుతాయ న్నారు. కుల గణన సమగ్ర సర్వే వివరాలు ఇతర రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉండవని అన్నారు. కుటుంబ , వ్యక్తిగత వివరాలు అధికార పార్టీకి అందుబాటులో ఉండటం వలన ఎన్నికల్లో అవి ప్రభావితం చేస్తాయన్నారు.

బ్రిటిష్ కాలంలో 1881లో భారత దేశంలో జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైందని ఇందులో కుల గణన కూడా ఒక అంశంగా 1931 వరకు ఉండేది అన్నారు. 1931 తర్వాత భారతదేశంలో కుల గణన జరగలేదని ఇటీవల కాలంలో బీహార్ రాష్ట్రంలో కులగణన సమగ్ర సర్వే నిర్వహించడం హర్షనీయమన్నారు. బీహార్ లో 63 శాతం ప్రజలు బాగా వెనకబడిన వర్గాలేననే విషయం అర్థమైందన్నారు.

ప్రభుత్వ పథకాల అమలు , సామాజిక సమస్యల పరిష్కారాలు కుల గణన సమగ్ర సర్వే ద్వారా సాధ్యమవుతుందని దేశవ్యాప్తంగా త్వరలో నిర్వహించే జనాభా లెక్కల సెన్సెస్ లో కుల గణన చేర్చాలని జనచైతన్య వేదిక డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఉన్న వాలంటీర్లతో నిర్వహిస్తున్న కుల గణన సమగ్ర సర్వేను వెంటనే ఆపాలని భారత ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల అధికారికి జన చైతన్య వేదిక కమిటీ విజ్ఞప్తి చేస్తుంది.



Read More
Next Story