డ్రగ్స్ రవాణా గుట్టు రట్టు చేసిన ఆపరేషన్ గరుడ...
x
సీబీఐ సీజ్ చేసిన కంటైనర్

డ్రగ్స్ రవాణా గుట్టు రట్టు చేసిన 'ఆపరేషన్ గరుడ'...

వేల కేజీల మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. సినిమా తరహాలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా ఆట కట్టింది.


(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: ఒకటి కాదు...రెండు కాదు...25 వేల కేజీల లోడ్ కంటైనర్... మిరియాల రవాణా ముసుగులో డ్రగ్స్ సరఫరా... డ్రగ్స్ ముఠా ఆట కట్టించిన సీబీఐ... కంటైనర్ సీజ్డ్... ఇదేదో సినిమాలో సన్నివేశం కాదు. విశాఖ పోర్టులో జరిగిన రియల్ స్టోరీ.

బ్రెజిల్ టు విశాఖ...

విశాఖపట్నం తీరంలో సీబీఐ అధికారులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్రెజిల్‌లోని శాంటోస్ పోర్టు నుంచి విశాఖకు పోర్టుకు వచ్చిన కంటైనర్లో 25 వేల కేజీల మిరియాల లోడ్ పేరిట డ్రగ్స్ సరఫరా జరుగుతుందన్న సమాచారాన్ని ఇంటర్పోల్.. సీబీఐకి అందించింది. ఈ మేరకు సీబీఐ అధికారుల బృందం 'ఆపరేషన్ గరుడ' పేరిట దాడులు నిర్వహించారు. బ్రెజిల్ నుంచి విశాఖపట్నం చేరిన కంటైనర్‌లో మాదకద్రవ్యాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. డ్రై ఈస్ట్ మిక్స్ చేసి వెయ్యి బ్యాగుల్లో 25 కేజీల చొప్పున ప్యాక్ చేశారు. ఇంటర్ పోల్ సమాచారంతో కస్టమ్స్ అధికారుల సహకారంతో భారీ డ్రగ్స్ మాఫియాను సీబీఐ అధికారుల బృందం పట్టుకుంది. విశాఖలోని ఓ ప్రైవేట్ కంపెనీ అడ్రస్‌లో డెలివరీ చేసేందుకు యత్నించినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. కంటైనర్ను సీజ్ చేసి విచారణ చేపట్టారు.

Read More
Next Story