గుంటూరులో ఘనంగా పాటకు ‘పట్టాభిషేకం’
x

గుంటూరులో ఘనంగా పాటకు ‘పట్టాభిషేకం’

మొన్న రాత్రి గుంటూరు అన్నమయ్య కళావేదికలో ‘పాటకు పట్టాభిషేకం’ కార్యక్రమం జరిగింది. వివరాలు


సామాజిక , రాజకీయ , సాంస్కృతిక రుగ్మతలకు వ్యతిరేకంగా కళాకారులు తమ ఆట - పాటల ద్వారా ఉద్యమించి, ప్రజలను జాగృతులను చేసి , పరిష్కార మార్గాలను సూచించాలని మాజీ మంత్రివర్యులు , ప్రముఖ భాష సాంస్కృతిక సేవకులు మండలి బుద్ధ ప్రసాద్ పేర్కొన్నారు.

జన చైతన్య వేదిక , సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈనెల 16వ తేదీ రాత్రి గుంటూరులోని అన్నమయ్య కళావేదిక లో నిర్వహించిన పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి అధ్యక్షత వహించారు.




ముఖ్యఅతిథిగా విచ్చేసిన మండలి బుద్ధ ప్రసాద్ ప్రసంగిస్తూ స్వతంత్ర ఉద్యమంలో పాట ప్రముఖ పాత్ర పోషించిందన్నారు. ఉద్యమాలకు ప్రాణం పోసేది పాట అని వివరించారు. సమాజ చైతన్య గీతాలు ప్రజలలో ఆలోచనలను రేకెత్తించి సమాజ మార్పుకు దోహద పడినాయన్నారు.

1990 నుండి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి వివిధ కళా జాతాలను నిర్వహిస్తూ అక్షరాస్యత ఉద్యమం , సారా వ్యతిరేక ఉద్యమం లతోపాటు శాస్త్రీయ భావజాల వ్యాప్తి కోసం కృషి చేస్తున్నారని గుర్తు చేశారు.

జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ 1990వ దశాబ్దంలో అంధ్రప్రదేశ్ లో జరిగిన అక్షరాస్యత ఉద్యమంలో షేక్ హబీబ్ మున్నీషా బేగం చదువు ప్రాధాన్యతను తెలిపే పాటలతో నిరక్షరాస్యులను చైతన్యవంతులను చేశారన్నారు. వేలాదిమంది కళాకారులకు శిక్షణ ఇచ్చి ప్రతి గ్రామంలో అక్షర కళాయాత్ర నిర్వహణకు తోడ్పాడిన మహనీయురాలని కొనియాడారు.

అక్షరాస్యత ఉద్యమ ఫలితంగా 1991 నుండి 2001 నాటికి 17 శాతం అక్షరాస్యత పెరిగిందన్నారు. ఓటరు మేలుకో అనే నినాదంతో త్వరలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రస్థాయి కళాజాతను ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాలలో నిర్వహించి ఓటింగ్ శాతం పెరుగుదలకు, సామాజిక , ఆర్థిక , రాజకీయ పరిస్థితుల పై అవగాహన కల్పించడానికి కృషి చేస్తామన్నారు. పురస్కార గ్రహీత షేక్ హాబీబ్ మున్నీషా బేగం కు లక్ష రూపాయలు నగదును అందించి శా లువాతో, పూలమాలతో ఘనంగా సత్కరించారు.



పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు కేఎస్ లక్ష్మణరావు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్, అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ, ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి గని, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు పి. చంద్ర నాయక్, ఆంధ్ర ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు జగన్ , శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అధ్యక్షులు సిహెచ్. మస్తానయ్య , మానవత చైర్మన్ పావులూరి రమేష్, సినీ నటులు చిట్టినేని లక్ష్మీనారాయణలు ప్రసంగించారు.

రంగం రాజేష్ నేతృత్వంలో ఎస్. జయ రావు, నంది అవార్డు గ్రహీత మహమ్మద్ మియా ల పాటలు, జానపదాలు, గజల్స్ గానం చేశారు.




Read More
Next Story