ఏపీలో జరగబోయే గోదావరి పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసింది.


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గోదావరి నది పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు నిధులు విడుదల చేసింది. తూర్పుగోదావరి జిల్లాకు గోదావరి పుష్కరాలు నిర్వహించడం కోసం రూ.100 కోట్ల నిధుల కేటాయింపులు చేశారు. 2027 లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు అఖండ గోదావరి ప్రాజెక్ట్‌ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లాకు ఈ నిధులు కేటాయించింది. ఆ మేరకు గోదావరి పుష్కరాలకు సంబంధించి త్వరలో టూరిజం శాఖ అధికారుల ఆధ్వర్యంలో పనులు ప్రారంభంకానున్నాయి.

2027లో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఇప్పుడు 2024వ సంవత్సరం నడుస్తోంది. అంటే మూడేళ్లు గడువు ఉంది. మూడేళ్లకు ముందుగానే కేంద్రప్రభుత్వం నిధులు విడుదల చేయడం గమనార్హం. అంటే గోదావరి పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో అర్థమవుతోంది. మరో వైపు ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన వరదల విపత్తుకు ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా నష్టం వాటిల్లిందని,బాధితులను ఆదుకునేందుకు వరద సాయం కింద రూ. 7,600 కోట్లు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే కేవలం రూ. వెయ్యి కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకుందని విమర్శలు వెల్లువెత్తాయి.



Next Story