పట్టు నెగ్గించుకున్న పవన్ కల్యాణ్.. ఆంధ్రకు ఆ ఐఏఎస్
x

పట్టు నెగ్గించుకున్న పవన్ కల్యాణ్.. ఆంధ్రకు ఆ ఐఏఎస్

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ కూడా తమ కోసం పనిచేసే అధికారులు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ కూడా తమ కోసం పనిచేసే అధికారులు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పలానా అధికారే కావాలంటూ కోరి మరీ అందుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఇప్పటికే సీఎంఓ అధికారుల కోసం నలుగురు అధికారులకు డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కు పంపాలని కేంద్రాన్ని కోరి తన డిమాండ్ నేరవేర్చుకున్నారు. ఇదే పంథాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కూడా కేరళ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కృష్ణ తేజ కావాల్సిందే అని మంచుపట్టు పట్టారు. అప్పటి నుంచి కృష్ణతేజ పేరు సోషల్ మీడియా అంతటా పెనమోగిపోతోంది. అయితే తాజాగా పవన్ కల్యాణ్ తన పట్టు నెగ్గించుకున్నారు. కృష్ణ తేజను డిప్యుటేషన్‌పై ఆంధ్రకు పంపడానికి కేంద్రం అంగీకరించింది. కేరళలో త్రిసూర్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కృష్ణతేజను మూడేళ్ల డిప్యుటేషన్‌పై ఆంధ్రకు పంపడానికి కేంద్రం పచ్చజెండా ఊపేసింది. దీంతో డిప్యూటీ సీఎం నిర్వహించే మంత్రిత్వ శాఖల్లో కృష్ణ తేజ పని చేసే అవకాశం ఉంది.

కృష్ణ తేజకు ఆ శాఖ వచ్చే అవశాఖ

ఈ క్రమంలో కృష్ణ తేజ.. ఏ శాఖ వ్యవహారా నిర్వర్తించే అవకాశం ఉంది అన్న అంశం కీలకంగా మారింది. తొలుత కృష్ణ తేజ.. పవన్ కల్యాణ్ ఓఎస్‌డీగా విధులు నిర్వర్తిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ స్థానంలో ఇప్పటికే వేరే అధికారిని నియమించేశారు. ఈ నేపథ్యంలో పవన్ నిర్వహించే ఓ శాఖ వ్యవహారాలను కృష్ణ తేజ చూసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే కృష్ణ తేజకు పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు అప్పగించాలని పవన్ కల్యాణ్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల అమరావతిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను కృష్ణతేజ కలిశారు. ఆ సందర్భంలో పవన్ కల్యాణ్.. ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం.

పవన్ ఆకర్షించిన అంశాలివే

తనకు తప్పనిసరిగా కృష్ణ తేజ కావల్సిందేనని పవన్ కల్యాన్ కోరారు. దీంతో కృష్ణ తేజలో పవన్ అంతగా ఆకర్షించిన అంశం ఏంటని చాలా మంది ఆలోచిస్తున్నారు. మరి అదేంటో చూద్దాం.. పవన్ కల్యాణ్‌ను ప్రజలకు మంచి చేయడంలో కృష్ణ తేజ అవలంబించిన మార్గాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని పవన్ కల్యాన్ సన్నిహితులు చెప్పుకొచ్చారు. ప్రజలకు సేవ చేయాలన్న కమిట్‌మెంట్ ఉన్న వ్యక్తి కృష్ణ తేజ అని పవన్ బలంగా నమ్ముతారని, ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటే తన పక్కన అలాంటి అధికారులే ఉండాలని పవన్ కల్యాణ్ వివరించారని తెలుస్తోంది. అంతేకాకుండా ప్రజల కోసం కృష్ణ తేజ చేసిన ఆపరేషన్ కుట్టునాడు, ఐయామ్ ఫర్ అలెప్పీ వంటి వాటితో ప్రజలతో మమేకం అయిన తీరును పవన్ ఎప్పుడూ మెచ్చుకునే వారని, శాఖ మారినా తీరు మారకుండా పర్యాటకశాఖ అధికారికగా కూడా అందరి మన్ననలు పొందారని పవన్ చెప్పేవారి తెలుస్తోంది. శాఖ ఏదైనా అంకితభావంతో పని చేసే కృష్ణ తేజ కమిట్‌మెంట్‌కు పవన్ ఫిదా అయ్యారని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.

Read More
Next Story