వైఎస్ఆర్ పేరు తొలగింపు ప్రతీకార చర్యే.. షర్మిల
x

వైఎస్ఆర్ పేరు తొలగింపు ప్రతీకార చర్యే.. షర్మిల

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను కొనసాగిస్తోంది. అందులో భాగంగానే పలు పథకాల పేర్లను కూడా మార్చారు సీఎం చంద్రబాబు.


ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను కొనసాగిస్తోంది. అందులో భాగంగానే పలు పథకాల పేర్లను కూడా మార్చారు సీఎం చంద్రబాబు. అంతేకాకుండా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎన్‌టీఆర్ మెడికల్ యూనివర్సిటీ పేరును వైఎస్‌ఆర్ పేరుతో మార్చింది. కాగా 2024లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం ఈ యూనివర్సిటీ పేరును మళ్ళీ మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పలు పథకాల నుంచి కూడా వైఎస్‌ఆర్‌ను తొలగించింది. వైఎస్‌ఆర్‌ పింఛన్‌ పథకానికి ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ స్కీమ్‌గా పేరు మార్చింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు కాబట్టి ఆయన పేరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు పింఛన్‌ పథకానికి పెట్టుకున్నారు. తాజాగా అదే పేరును తిరిగి ఖరారు చేశారు. ఈ పేరు మార్పుడు రాజకీయాలపై తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. ఈ చర్యలను కాంగ్రెస్ పార్టీ ప్రతీకార చర్యలుగానే భావిస్తుందని అన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ పెట్టారు.

వైఎస్ఆర్ పథకాలు దేశానికే ఆదర్శం

‘‘వైద్య,విద్యా సంస్థలకు NTR పేరు తొలగించి మాజీ సీఎం వైఎస్ జగన్ అనాడు పెద్ద తప్పు చేస్తే.. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు, ఆసుపత్రులకు దివంగత ముఖ్యమంత్రి YSR పేరు తొలగించడాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతీకార చర్యగా భావిస్తోంది. NTR అయినా, YSR అయినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడిన వాళ్లే. పాలనలో తమదైన ముద్ర వేసిన వాళ్లే. రాజకీయాలకు అతీతంగా ఇద్దరిని చూడాలి తప్పితే.. నీచ రాజకీయాలను వారి పేర్లకు కూడా ఆపాదించడం సమంజసం కాదు. YSR అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్మెంట్, రుణమాఫీ, ఉచిత కరెంట్,పెన్షన్లు, ఇలా ప్రతి పథకం దేశానికే ఆదర్శం. YSR ఏదో ఒక్క పార్టీకి సొంతం కాదు.. తెలుగు వారి ఆస్తి. తెలుగు వారి గుండెల్లో ఆయన స్థానం ఈనాటికీ పదిలం. YCP మీద ఉన్న కోపాన్ని YSR మీద రుద్దడం సరికాదు. YCPలో YSR లేడు. అది ఎన్నటికైనా వైవీ, సజ్జల, సాయి రెడ్డి పార్టీనే’’ అంటూ ఆమె విమర్శలు గుప్పించారు.

Read More
Next Story