భేటీ కానున్న పవన్, బాబు.. వాటిపైనే చర్చ..
x

భేటీ కానున్న పవన్, బాబు.. వాటిపైనే చర్చ..

ఆంధ్రలో ఎన్నికల హీట్ మరోసారి పెరుగుతోంది. విజయం ఎవరిని వరిస్తుందనేది ఇంకా మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగలింది. ఎవరికి వారు తామే గెలుస్తామని చెప్పుకుంటున్నారు..


ఆంధ్రలో ఎన్నికల హీట్ మరోసారి పెరుగుతోంది. విజయం ఎవరిని వరిస్తుంది అన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగలింది. ఎవరికి వారు తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతలో కౌంటింగ్ దగ్గర పడుతోంది. ఈ తుది ఘట్టానికి మరెన్నో రోజుల సమయం లేదు. ఇంతలో వైసీపీని ఓడించడమే ధ్యేయంగా ఒక్కటైన టీడీపీ, జనసేనే పార్టీ అధినేతలు అతి త్వరలో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. మే 31న వారు ఆంధ్రలో వీరు భేటీ అవుతారని, ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

బీజేపీ చేరుతుందా..

మే 31న జరిగే ఈ కూటమి నేతల సమావేశంలో బీజేపీ నేతలు కూడా పాల్గొంటారా అనేదానిపై కూడా కూటమి వర్గాల్లో చర్చ తీవ్రంగా జరుగుతోంది. ఎన్నికల ముందు తిరుపతిలో మూడు పార్టీల మధ్య సఖ్యత కుదర్చడానికి జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆ సమయంలో బీజేపీ నేతలను ఇతర పార్టీ నేతలు అడ్డుకున్నారని, దాంతో వారు ఆగ్రహించి వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. అదే నిజమయితే మే 31న జరిగే ఈ భేటీకి వారు వస్తారా రారా అనేది కీలకంగా మారింది. అయితే ఈ సమావేశంలో బీజేపీ నేతలు తప్పకుండా పాల్గొంటారని, కూటమి పార్టీల మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఆయా పార్టీల వర్గాలు చెప్తున్నాయి. అందుకు మేనిఫెస్టో విడుదలకు మూడు పార్టీల నేతలు కలిసి రావడాన్ని నిదర్శనంగా చూపుతున్నారు.

ఈ అంశాలపైనే సమీక్ష

మే 31న నిర్వహించే ఈ సమావేశంలో ఈ అంశాలపై చర్చ జరగనుంది అన్న అంశంపై కూడా చర్చలు బాగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సమావేశంలో పోలింగ్ జరిగిన తీరు, పోలింగ్ తర్వాత ఏర్పడిన రాజకీయ పరిణామాలు, కూటమి నేతలు, కార్యకర్తల భద్రత, కౌంటింగ్ రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన పనులపై ప్రధానంగా చర్చ జరుగుతుందని కూటమి శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. అంతేకాకుండా ఎవరెవరికి గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి అన్న నేతల పేర్లను కూడా లిస్ట్‌ అవుట్ చేసుకుని, తమ అంచనాలను కూడా పరీక్షించుకోవడంపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఇంకా ఐదు రోజులే..

అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎన్నికల కౌంటింగ్‌కు ఇంకా ఐదు రోజుల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో తమ కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు తెగ ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రమాణ స్వీకారం అక్కడే అని, ప్రమాణ స్వీకార వేడుకలో వడ్డించే వంటకాలు ఇవేనంటూ మెనూ లిస్ట్‌లను కూడా కొందరు ప్రకటిస్తున్నారు. కానీ ఇదంతా ఎన్నికల కౌంటింగ్ సమయంలో పార్టీలు ఆడుతున్న మైండ్ గేమ్స్ మాత్రమేనని విశ్లేషకులు చెప్తున్నారు.

Read More
Next Story