మంత్రి అచ్చెన్నాయుడు జగన్‌పై విమర్శలు గుప్పిస్తూనే మర్చి రైతులకు ఇబ్బందులున్న మాట వాస్తవమే అని అన్నారు.
సీఎం చంద్రబాబు స్పందించారు. జగన్ ప్రభుత్వం మీద అలా విమర్శలు గుప్పించారో సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. అక్కడ వారిని కలిసి ముఖా ముఖి నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవడంలోను, గిట్టుబాటు ధరలు కల్పించడంలోను కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ఘోరంగా వైఫల్యం చెందారని ధ్వజమెత్తారు. అమరావతి సచివాలయానికి, గుంటూరు మిర్చి యార్డుకు కూత వేటు దూరంలోనే ఉందని, కానీ మిర్చి రైతులు పడుతున్న కష్టాలను తెలుసుకోవడంలోను వారికి మేలు చేసే విషయంలోను పట్టించుకోలేదని జగన్ విమర్శలు గుప్పించారు. మిర్చి యార్డుకు జగన్ వస్తున్న సందర్భంగా భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు. మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోని మిర్చి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని కోరారు. మార్కెట్ జోక్యం ద్వారా తగ్గిన ధరలను భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సాగు వ్యయానికి, విక్రయ ధరలకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని కేంద్రాన్ని కోరారు. 50 శాతం నిష్పత్తిలో కాకుండా పూర్తి స్థాయిలో 100 శాతం నష్టాన్ని భరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రైతులను ఆదుకోవాలన్నారు. ఆ మేరకు సీఎం చంద్రబాబు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. జగన్ టూర్‌కు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం, మిర్చి రైతుల ఇబ్బందులు పడుతుండటం, గిట్టుబాటు ధరలు లేకపోవడం, వీటి మీద జనగ్ మాట్లాడటం ప్రభుత్వ మీద ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందనుకున్నారో ఏమో కానీ తక్షణమే స్పందించి కేంద్రానికి లేఖ రాశారు సీఎం చంద్రబాబు.
మరో వైపు మంత్రి అచ్చెన్నాయుడు మాజీ సీఎం జగన్ మీద ధ్వజమెత్తారు. 151 సీట్లతో ప్రజలు అధికారమిస్తే గత ఐదేళ్లు ప్యాలెస్‌లకే పరిమితమయ్యారని జగన్ మీద మండిపడ్డారు. ప్రతిపక్షాలు, మీడియా ఎంతో ఘోషించినా గత ఐదేళ్లు ప్యాలెస్‌లను జగన్ వీడలేదన్నారు. ఇలాంటి వ్యక్తిని రాజకీయాల్లో ఉండొద్దని ప్రజలు జగన్‌ను చిత్తుగా ఓడించారని ఎద్దేవా చేశారు. జగన్ మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి సరిగా లేదని అనిపిస్తోందని, జగన్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో 11 జిల్లాల్లో మిర్చి పంట పండుతోందన్నారు. గత పది సంవత్సరాలలో అత్యధికంగా రూ. 13వేలు ధర ఉందని, అందులో రెండు సంవ్సరాలు మాత్రమే మిర్చి రైతులకు రూ. 20వేలు ధర పలికిందని చెబుతూనే.. మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తమే అని అన్నారు. నేడు సాగు ఖర్చులు పెరిగాయి. పెట్టుబడి పెరిగింది. దిగుబడులు తగ్గుతున్నాయంటూ మిర్చి రైతుల సమస్యల గురించి వెల్లడించారు. ఒక పక్క జగన్‌ను విమర్శిస్తూనే మరో పక్క మిర్చి రైతులు కష్టాలు పడుతున్నారి చెప్పొకొచ్చారు.
Next Story