నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంది. నడిపేది.. నడిపించేది లోకేష్‌ అన్నది వాస్తం. అంటూ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు.


రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడంలోను, సెటైర్లు వేయడంలోను, ట్వీటర్‌లో స్పందించడంలోను వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి స్టైలే వేరు. సూటిగా, స్పష్టంగా, సెటైరికల్‌గా ఆయన ట్వీట్లు చేస్తూ, తనదైన శైలిలో వ్యంగాస్త్రాలు విసురుతుంటారు. తాజాగా అదే రీతిలో సీఎం చంద్రబాబు నాయుడుపైన, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్‌పైన మరో ట్వీట్‌ చేశారు. చెప్పింది నాలుగు లైన్లు అయినా.. ఆ నాలుగు వ్యాఖ్యాలలోనే తాను చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలపై ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఉత్తుత్తి హామీలతో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారని విమర్శించారు. నిజానికి, వాస్తవానికి చాలా తేడా ఉంది. చెప్పిన అబద్దాలు మళ్లీ చెప్పకుండా ఉత్తుత్తి హామీలతో సూపర్‌ డూపర్‌ సిక్స్‌తో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడన్నది ‘నిజం’. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా, అన్నీ తానై నడిపేది, నడిపించేది లోకేష్‌ అన్నది ‘వాస్తవం’. నిజానికి–వాస్తవానికి మధ్య ఉన్న ఆ సన్నటి గీతని అర్థం చేసుకోవడం ‘ప్రజాధర్మం’. అంటూ పోస్టులో పేర్కొన్నారు.



Next Story