అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
x

అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్‌ను చంద్రబాబు మరోసారి కదిలించారు. ఈసారి ఎలాగైనా దీనిని పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. ఓఆర్ఆర్ పూర్తయితే మరో మెగాసిటీగా మారుతుందని భావిస్తున్నారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత రెండు ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత కీలకంగా మారిన అంశం ప్రాజెక్ట్ రాజధాని. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలని, ప్రపంచంలోనే మెరుగైనా నగరాల్లో ఒకటిగా రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు శ్రమించారు. విభజన కారణంగా ఆర్థికంగా కూడా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. దాంతో అన్ని విధాలుగా ఆంధ్రను తీర్చిదిద్దాలని చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు. వాటిలో అతి ముఖ్యమైనది అమరావతి చుట్టూ నిర్మించాలనుకున్న ఔటర్ రింగ్ రోడ్డు. ఈ ప్రాజెక్ట్ కోసం చంద్రబాబు ఓ చిన్నపాటి యుద్ధమే చేశారు. తీరా అనుమతులు సాధించి ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామనుకునే సరికి రాష్ట్రంలో ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడం జరిగిపోయాయి. దాంతో ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ అటకెక్కేసింది.

అలమరాకి చేరిన ఓఆర్ఆర్ ప్రాజెక్ట్‌ను రాష్ట్రంలో మళ్ళీ ఏర్పాడిన చంద్రబాబు ప్రభుత్వం బయటకు తీసింది. మరోసారి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టింది. ఈసారి ఎలాగైనా దీనిని ప్రారంభించడమే కాకుండా పూర్తి కూడా చేయాలన్న లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తోంది. వీలైతే ఆంధ్రప్రదేశ్‌కు అమరావతిని రాజధానిగా కూడా మార్చేయాలని, అమరావతి నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కూడా చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

మోదీ ప్రభుత్వానికి చంద్రబాబు కీలకం

2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబు సహకారం కలకంగా మారింది. చంద్రబాబు మద్దతు ఇవ్వను అని తటస్థంగా ఉంటే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు అనేది అనితర సాధ్యంలా మారేది. దీంతో చంద్రబాబు అధికారంలోకి వస్తూనే అమరావతికి ఊపిరి పోసినట్లు మారింది. చంద్రబాబు డిమాండ్లకు ఓకే చెప్పడం తప్ప మరే దారి లేని స్థితిలో కేంద్రం ఉండటంతో ఈసారి అమరావతి పూర్తి కావడం ఖాయమని అంతా భావిస్తున్నారు. ఇదే సరైన సమయంగా భావించే ఆయన ఓఆర్ఆర్ ప్రాజెక్ట్‌ను మరోసారి కదిలించారని కూడా వాదన వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు కావాల్సిన నిధులకు కూడా కేంద్రంతో చర్చించి చంద్రబాబు మరోసారి ఆమోదం తీసుకొచ్చుకున్నారని సమాచారం.

అంచనా వ్యయం రూ.25 వేల కోట్లు

అమరావతి చుట్టూ కృష్ణా, గుంటూరు జిల్లా గుండా 189 కిలోమీటర్ల పొడవుతో ఔటర్ రింగ్ రోడ్ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈప్రాజెక్ట్ మొత్తం పూర్తి చేయడానికి రూ.25 వేల కోట్ల ఖర్చు అవుతుందని అంచనావేశారు. భూసేకరణ ఖర్చుతో సహా మొత్తాన్ని కేంద్రప్రభుత్వమే భరిస్తుందని రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ఈమేరకు నిధుల కేటాయింపు కూడా రానున్న బడ్జెట్‌లో జరగనుందని తెలిపారు. దీంతో ఓఆర్ఆర్ పరిసర గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మెగా సిటీ నిర్మాణంపై ఫోకస్

ఓఆర్ఆర్ నిర్మాణం పూర్తయితే ఏపీతో పాటు అమరావతి అభివృద్ధి కూడా పరుగులు పెడుతుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ భారం మొత్తాన్ని కేంద్రమే భరాయించనుంది. ఈ ప్రాజెక్ట్‌తో పలు నగరాల మధ్య దూరం తగ్గి కనెక్టివిటీ పెరుగుతంది. ఓఆర్ఆర్ నిర్మాణంతో లోపలి భూములే కాకుండా ప్రాజెక్ట్ బయటి భూములకు కూడా డిమాండ్ భారీగా పెరగనుంది. దీంతో ఎన్నో ఆర్థిక కార్యకలాపాలకు ఈ ప్రాంతం కేంద్రమవుతుంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కలుపుకుని ఓ మెగాసిటీగా అవతరిస్తాయని చంద్రబాబు యోచిస్తున్నారు. ఓఆర్ఆర్ ప్రభావం కొన్ని కిలోమీటర్ల మేరా ఉండనుంది. ఈ మెగాసిటీలో విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి కూడా భాగమయ్యే అవకాశం ఉంది.

Read More
Next Story