‘నమ్మినవాళ్లను ముంచడం జగన్ నైజం’.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
x
ఎమ్మిగనూరు ప్రజాగళంలో ప్రసంగిస్తున్న చంద్రబాబు

‘నమ్మినవాళ్లను ముంచడం జగన్ నైజం’.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఎమ్మిగనూరు ప్రజాగళం సభలో వైసీపీ పాలనలో రాష్ట్రానికి జరిగిన మేలేమీ లేదని చంద్రబాబు మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే సీమ దిశ, దశ మారుస్తానని హామీ ఇచ్చారు.


ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఆంధ్ర రాజకీయాలు అంతకంతా వేడెక్కుతున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలతో రాష్ట్రమంతా హోరెత్తుతోంది. ఇప్పటికే జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న పార్టీలు ప్రత్యర్థులు విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతన్నాయి. ఈ నేపథ్యంలో జగన్.. రాయలసీమ ద్రోహి అని, ప్రజలను మోసం చేయడం తప్ప ఈ ఐదేళ్లలో జగన్ ఏం చేయలేదంటూ ఎమ్మిగనూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో ఎక్కడ చూసి దగాకోరు పాలనే కనిపిస్తోందని, దీనిని మార్చే మహత్తర అస్త్రం ప్రజల చేతుల్లోనే ఉందని, దానిని వినియోగించాల్సిన సమయం కూడా ఆసన్నమైందని చంద్రబాబు కీలకంగా వ్యాఖ్యానించారు.

ఫ్యాను ముక్కలవడం ఖాయం
రానున్న ఎన్నికల్లో ప్రజల నిర్ణయం చూసి ఫ్యాను ముక్కలవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కూడా ఫ్యాన్‌ను చెత్తకుప్పలో వేయాడం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ‘‘మోసాలు చేయడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. అందుకే బీజేపీతో తాత్కాలిక పొత్తే అంటూ నా పేరు మీద కూడా లేఖ రాశారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి కూటమిలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు. ఓడిపోతామన్న భయంతోనే వైసీపీ ఇలాంటి నీచ రాజకీయాలకు తలపడుతుంది. నమ్మినవాళ్లను ముంచడం జగన్ నైజం. అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. వాటికి గురించి ప్రజలకు ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. కానీ టీడీపీపై నిందలు వేస్తున్న వైసీపీ వాళ్లకు ఒక విషయం తెలియదు. మాది పేదల పక్షం. బీసీ అనేది టీడీపీ డీఎన్‌ఏలోనే ఉంది. టీడీపీ.. ఒకే సామాజికవర్గానికి చెందిన వారికే 48 సీట్లు ఇచ్చి సామాజిక న్యాయం అనే పార్టీ కాదు. అలా చేసేది వైసీపీ.. అది పెత్తందారులు, భూస్వాముల పార్టీ’’అని ధ్వజమెత్తారు చంద్రబాబు.
సీమ దిశ, దశ మారుస్తాం
‘‘టీడీపీ హయాంలో రాయలసీమలు ప్రారంభించిన ప్రాజెక్టులలో వైసీపీ 102 ప్రాజెక్టులను రద్దు చేసింది. వైసీపీ విధానాల వల్ల సీమ ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వస్తే సీమకు సాగునీటి ప్రాజెక్ట్‌లు తీసుకొచ్చి సీమ దిశ, దశ మారుస్తాం. వెనకబడిన వర్గాలకు రూ.1.5 లక్షల కోట్లతో సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తాం. చట్టపరంగా కులగణన నిర్వహిస్తాం. ఎమ్మిగనూరుకు టెక్స్‌టైల్స్ పార్కు తెస్తాం. వచ్చే ఎన్నికల్లో సీమ ద్రోహి జగన్‌కు ఒక్క ఫోటు కూడా వేయొద్దు. ఆయనకు ఓటేస్తే మన మీద మనమే చెత్త వేసుకున్నట్లు. అది గమనించుకుని ఓటర్లు ఓటు వేయాలి’’అని చంద్రబాబు కోరారు.
Read More
Next Story