ఎవరైన తల్లిదండ్రులు తమ పిల్లలకు అబద్ధాలు చెప్పకూడదని, నిజాయితీ, నీతిగా బతకాలని చెబుతారు. కానీ చంద్రబాబు అలా కాదని జగన్ అన్నారు.
మనం మన పిల్లకు ఏమి చెబుతాం.. ఏమి నేర్పుతాం. అబద్ధం ఆడకూడదు. దొంగతనం చేయకూడదు. మోసం చేయకూడదు. విలువలతో బతకాలి అని చెబుతాం. పాఠశాలల్లో కూడా ఇదే చెబుతారు. కానీ చంద్రబాబు తీరే వేరు. అబద్ధాలు చెప్పు. స్వార్థం కోసం పని చేయి. మోసం చేయి.. వెన్నుపోటు పొడువు.. సొంత మామనే మోసం చేయి అని చెప్పి నేర్పించే వ్యక్తి చంద్రబాబు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అబద్దాలు తప్ప నిజాలు చెప్పని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే.. అది చంద్రబాబే అని జగన్ ఎద్దేవా చేశారు. దానికి ఇటీవల ఢిల్లీలో 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌ను కలిసిన సందర్భంలో కూడా అబద్దాలు చెప్పారని విమర్శించారు. ఈ సారి దావోస్ పర్యటనలో ఒక ఎమ్మోవోయు కూడా చేసుకోలేక పోయారు. పెట్టుబడులు పెడుతామని జిందాల్ వస్తే వారిపైన కేసులు పెట్టి భయపెట్టి వెళ్లగొట్టారుని మండిపడ్డారు.
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి వచ్చిందేమీ లేదు. 12 మంది ఎంపీలున్న బీహారీలు.. చాలా సంపాదించుకున్నారు. మరి చంద్రబాబు ఏమి సాధించారు? సాధించక పోగా ఉన్న పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు. 10వేల మెడికల్ సీట్లు ఇస్తామని కేంద్రం చెబుతుంటే.. చంద్రబాబు వద్దని లేఖలు రాశారు. ఇలా వద్దని చెప్పి రాష్ట్రం ఏపీనే, సీఎం చంద్రబాబే అన్నారు. భావితరానికి మేలు జరిగే మెడికల్ సీట్లు ఎవరైనా వద్దంటారా? ఇంతకన్నా విధ్వంసం ఉంటుందా? అని జగన్ ప్రశ్నించారు.
9నెలల్లో కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు అనేక విధ్వంసాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. అమ్మ ఓడిని ఆపేశారు. నాడు నేడు నిలిపేశారు. సీబీఎస్, టోఫెల్‌ను తీసేశారు. 8వ తరగతికి విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్‌లు పంణీని నిలిపేశారు. సబ్జెక్టు టీచర ను పక్కన పెట్టారు. వసతి దీవెనను రద్దు చేశారు. ఇన్ని కార్యక్రమాలను రద్దు చేసిన సీఎం చంద్రబాబు విద్యార్థుల చదువు, జీవితాలతో చెలగాటం కాదా? అని నిలదీశారు.
ఆరోగ్యశ్రీని తీసేశారు. ఆసరా కనబడకుండా చేశారు. రైతు భరోసా నిలిపేశారు. సున్నా వడ్డీని, ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్‌ను తీసేశారు. ఆర్డీకే, ఇక్రాప్ విధానాలను రద్దు చేశారు. చేయూత, కాపు నేస్తం వంటి పథకాలను రద్దు చేశారు. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారు. వలంటీర్లను తీసేశారు. అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో దుర్మార్గంగా వ్యవహరించారని, ఇక ఎన్నికలు ఎందుకు డిక్లేర్ చేసుకోండని అన్నారు. నాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో
తాడిపత్రి, దర్శి టీడీపీ గెలుచుకుంది. తక్కిన అన్నీ వైసీపీ గెలుచుకుంది. కానీ ఆ నాడు తాము తలుచుకుని ఉండి ఉంటే ఆ రెంటిండిని కూడా లాగేసుకునేకునే వాళ్లం.. కానీ తాము అలా చేయలేదు. అది గవర్నెన్స్ అంటే. అని జగన్ అన్నారు. రాని పదవులు కూడా కావాలని ఆశపడటం తప్పు. చంద్రబాబుకు జ్ఞానం, బుద్ది లేవు. జమిలీ.. గిమిలీ అంటున్నారు.. ఇవి తొంతర రావాలి అంటూ జగన్ పేర్కొన్నారు.
Next Story