చంద్రబాబు ప్రమాణ స్వీకారం @11.27 am
x

చంద్రబాబు ప్రమాణ స్వీకారం @11.27 am

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు కేంద్ర స్థాయి అతిథులు కూడా వీచ్చేయనున్నారు.


ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు కేంద్ర స్థాయి అతిథులు కూడా వీచ్చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం ఎప్పుడు అన్న అంశంపై అనేక వార్తలను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొందరు ఉదయం 9 గంటలకే చంద్రబాబు ప్రమాణ స్వీకారం అంటే మరికొందరు మధ్యాహ్నం 12 గంటలకని, ఇంకొందరు ఉదయం 10 గంటలకంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో చంద్రబాబు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు వీరంతా కూడా ఏది సరైన సమయో అర్థంకాక అయోమయంలో పడిపోయారు. అసలు ప్రమాణ స్వీకారం డేట్‌ అయినా సరైనదేనా అంటూ సోషల్ మీడియా వేదికగా సమస్యను లేవనెత్తారు. ఇది కాస్తా వైరల్ కావడంతో తాజాగా దీనిపై టీడీపీ స్పందించింది.

క్లారిటీ ఇచ్చిన టీడీపీ

చంద్రబాబు ప్రమాణ స్వీకార వేడులకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న అడ్డగోలు ప్రచారంపై టీడీపీ స్పందించింది. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని తెలుగు తమ్ముళ్లకు కోరింది. ఆంధ్రప్రదేశ్ నూతన సీఎంగా నారా చంద్రబాబు నాయుడు.. మే 12 ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారని స్పష్టం చేసింది. ఆయన ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే రాష్ట్ర కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతుందని తెలిపింది. ఇప్పటికే ఆ దిశగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని టీడీపీ చెప్పింది.

ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ ఏర్పాట్లు

కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ వేదికగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ వేడుకల కోసం దాదాపు 12 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు అధికారులు. ఈ క్రమంలోనే ప్రమాణ స్వీకారానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. ఈ ఏర్పాట్లను తాము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా గవర్నర్, ఇతర ప్రముఖులు విచ్చేస్తున్న నేపథ్యంలో భద్రత విషయంలో మరింత పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ముందే పని మొదలుపెట్టిన బాబు

ప్రమాణ స్వీకారానికి ముందు చంద్రబాబు తన మార్క్ పనిని రాష్ట్రంలో ప్రారంభించేశారు. కీలక శాఖల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని తెప్పించుకుని దానిని పరిశీలిస్తున్నారు. పలు అంశాలపై వరుస రివ్యూలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రజా సంబంధిత అంశాలపై నిర్లక్ష్యం తడదని, అధికారులు తమ విధుల పట్ల క్రమశిక్షణతో నడుచుకోవాలని ఇప్పటికే అధికారులకు సూచించారు. వీటిలో భాగంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వీధి దీపాలు కూడా వెలగట్లేదన్న సమస్య వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించడమే కాకుండా ఆ సమస్యను పరిష్కరించడానికి డెడ్‌లైన్ కూడా పెట్టారు. దాంతో పాటుగా గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నివారణకు సరైన చర్యలు తీసుకోవాలని, వాటిపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు శుభ్రమైన తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవానలి చెప్పారు. ఇలా మరెందరో అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు.

Read More
Next Story