మరోసారి ఢిల్లీ బాట పట్టిన నారా చంద్రబాబు..
ఆంధ్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీకి పయనమవుతున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు.
ఆంధ్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీకి పయనమవుతున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో భాగంగానే ప్రధాని మోదీతో కూడా చంద్రబాబు బేటీ కానున్నారు. ఇందుకోసం ఇప్పటికే అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అవిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా చంద్రబాబు చర్చలు జరపనున్నారు. ఈ పర్యటలో ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులు, సమస్యలపై చర్చించనున్నారు. ఇందులో అమరావతి, పోలవరం, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు వంటి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు.. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు.
నిర్మలమ్మతో అవే చర్చలు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అందిస్తామన్న నిధుల గురించే ప్రధానంగా చర్చించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. వాటితో పాటు ప్రాజెక్టులపై కూడా చంద్రబాబు.. ఢిల్లీ పెద్దలతోచర్చలు జరపనున్నారు. వెనకబడిన జిల్లాల అభివృద్ధికి అందిస్తామన్న సహకారం, వాటి అభివృద్ధికి ఇస్తామన్న నిధులతో పాటు కొత్త రుణాలపై కూడా చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇందులో భాగంగానే వైఎస్ జగన్ హయాంలో చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని కోరాలని కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంపైనా స్పెషల్ ఫోకస్
ఢిల్లీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్ట్‌లపై చర్చించనున్న చంద్రబాబు.. అదే సమయంలో రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకురావడంపై కూడా ఫోకస్ పెట్టనున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి సరికొత్త పరిశ్రమలను నిర్మించాలని చంద్రబాబు శ్రమిస్తున్నారు. ఇందుకోసమే ఇప్పటికే దాదాపు ఆరు శాఖల్లో కొత్త విధానాలను అమలు చేయడం ప్రారంభించారు. పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగించి రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలని సీఎం చంద్రబాబు శ్రమిస్తున్నారు.