సీఎం చంద్రబాబు నిజ స్వరూపాన్ని సుప్రీం ఎత్తి చూపింది. అయినా ఆయనలో పశ్చాతాపం రాలేదు. దేవుడంటే ఆయనకు భయం లేదు. వెంకటేశ్వర స్వామి ఆయనకు మొట్టికాయలు వేస్తారు.


సుప్రీం కోర్టు అక్షింతలు వేసినా సీఎం చంద్రబాబు తీరు మారలేదని మాజీ సీఎం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి విమర్శించారు. రాజకీయ దుర్భుద్ధితో మత విశ్వాసాలను ఎలా రెచ్చగొట్టారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుందన్నారు. లడ్డూ వివాదంపై శుక్రవారం సుప్రీం తీర్పు నేపథ్యంలో తాడేపలిలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

పొలిటికల్‌ డ్రామాలు చేయొవద్దని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పినా టీడీపీ ఇప్పటికీ అసత్య ప్రచారమే చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు ముట్టికాయాలు వేసినా, స్వతంత్ర సంస్థతో దర్యాప్తుకు ఆదేశించాని సీఎం చంద్రబాబులో పశ్చాత్తాపం కనిపించడం లేదని మండిపడ్డారు.
సుప్రీం కోర్టులో జరిగిన విచారణను ప్రజలందరూ గమనించి ఉంటారు. సీఎం చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీం కోర్టు ఎత్తి చూపించిందని, సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలాను ఎలా కావాలనే రెచ్చగొట్టారో సుప్రీం కోర్టు అర్థం చేసుకుందన్నారు. కాబట్టే దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని, పొలిటికల్‌ కామెంట్స్‌ చేయవద్దని సీఎం చంద్రబాబుకు వార్నింగ్‌ ఇచ్చిందన్నారు. సీఎం చంద్రబాబు వేసుకున్న సిట్‌ను సైతం రద్దు చేసిందన్నారు.
సాక్ష్యాధారాలతో సహా తాను చూపించడమే కాకుండా సుప్రీం కోర్టు సైతం సీఎం చంద్రబాబును ప్రశ్నించిందన్నారు. తన అబద్దాలతో సీఎం చంద్రబాబు కోట్లాది మంది భక్తుల విశ్వాసం, నమ్మకాన్ని దెబ్బతీశారని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం సీఎం చంద్రబాబు మంచి వ్యక్తి అయితే సిగ్గుపడాలి, భయపడాలి, ప్రశ్చాత్తాపం రావాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.
టీడీపీ ఆఫీషీయల్‌ ట్విట్టర్‌లో సీఎం చంద్రబాబు పెట్టిన పోస్టు చూస్తే ఆయన నైజం ఏంటో తెలుస్తుందన్నారు. సుప్రీం కోర్టు సీరియస్‌ కావడంతో బావ ధర్మారెడ్డి, మామ కరుణాకర్‌రెడ్డి అంటూ పోస్టు పెట్టి వక్రీకరణలు చేస్తున్నారని మండి పడ్డారు. సీఎం చంద్రబాబుకు సుప్రీం కోర్టు అంక్షింతలు వేస్తే, నేషనల్‌ మీడియా మొత్తం ఆక్షేపించిందన్నారు.
టీటీడీ లడ్డూ విశిష్టతను దెబ్బతీస్తే కోర్టు కూడా మొట్టికాయలు వేయాలని ప్రధానికి కూడా లేఖ రాశామన్నారు. లడ్డూలో జంతు కొవ్వు ఉందని సీఎం ఎలా చెబుతారని సుప్రీం కోర్టు ప్రశ్నించిందన్నారు. ఈ వ్యాఖ్యలు సిట్‌ విచారణలో ప్రభావితం చూపించవా? అని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు సీఎం చంద్రబాబును తిడితే, మీ పాపం పండింది జగన్‌ అంటూ వక్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నారని సీరియస్‌ అయ్యారు. దేవుడంటే సీఎం చంద్రబాబుకి భయం లేదని, వెంకటేశ్వర స్వామే ఆయనకు మొట్టికాయలు వేస్తారని అన్నారు.
Next Story