సీఎం చంద్రబాబు తనకు స్ఫూర్తి అని పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ కు ఎంతమంది స్ఫూర్తి అంటూ మాజీ మంత్రి చెల్లుబోయిన ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ అప్పుడేమో చేగువేరా అన్నారని, ఇప్పుడేమో చంద్రబాబు అంటున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ పవన్ కల్యాణ్ పై సెటైర్లు పేల్చారు. సనాతనధర్మం పేరుతో డ్రామాలాడారని ధ్వజమెత్తారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఈరోజు ప్రశంసలు కురిపించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పరిపాలనలో చంద్రబాబు తనకు స్ఫూర్తి అని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ సెటైర్లు వేశారు.
పవన్ కు ఎంత మంది స్ఫూర్తి? అని ఆయన ప్రశ్నించారు. చేగువేరా తనకు స్ఫూర్తి అని గతంలో పవన్ చెప్పారని, ఇప్పుడేమో చంద్రబాబు తనకు స్ఫూర్తి అంటున్నారని ఎద్దేవా చేశారు. నిన్నటి వరకు సనాతనధర్మం పేరుతో డ్రామాలాడారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీపై కూడా చెల్లుబోయిన విమర్శలు గుప్పించారు. సొంతవారికి సంపద సృంష్టించేందుకే కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారని మండిపడ్డారు. మద్యం టెండర్లకు దరఖాస్తు ప్రక్రియను రెండు రోజులు పొడిగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ప్రజలను తాగుబోతులు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story