చిత్తూరు:ఏనుగుల దాడిలో గాలిలో కలిసిన మరో రైతు ప్రాణం
x

చిత్తూరు:ఏనుగుల దాడిలో గాలిలో కలిసిన మరో రైతు ప్రాణం

శిక్షణా శిబిరాలకే పరిమితమైన కుంకీ ఏనుగులు.


చిత్తూరు జిల్లాలో ఏనుగుల పాదాల కింద నలిగిన మరో రైతు ప్రాణం గాలిలో కలిసింది. 16కు పైగానే ఉన్న ఏనుగుల మంద దాడి చేయడంతో పొలంలోనే రైతు ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లా సోమల వద్ద శనివారం రాత్రి జరిగింది.

చిత్తూరు జిల్లాలో అడవుల నుంచి వచ్చే మదపుటేనుగులను దారిమళ్లించడానికి శిక్షణ ఇచ్చిన ఆరు కుంకీ ఏనుగులు శిక్షణ శిబిరాల నుంచి కదిలించడం లేదు. దీంతో అడవులకు సమీపంలోని పల్లెల వైపు, పంటలపై దాడులకు దిగుతున్న ఏనుగుల వద్ద రైతుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.
సోమల మండలం కొత్తూరు గ్రామం వద్ద శనివారం రాత్రి వెలుగు చేసింది. గ్రామానికి చెందిన కృష్ణంరాజు (54) తనకు ఉన్న పొలంలో టమాటా తోట సాగు చేస్తున్నాడు. పొలం పనుల్లో ఉండగా ఏనుగుల మంద ఒక్కసారిగా ఘీంకారాలు చేస్తూ, దూసుకుని వచ్చాయి. ఊహించని పరిణామంతో కృష్ణంరాజు పరుగెత్తలేక కింద పడిపోవడంతో ఏనుగులన్నీ ఒక్కసారిగా దాడి చేసి, తొక్కి పంచేశాయని గ్రామాస్తుల ద్వారా తెలిసింది.
మృతుడు కృష్ణంరాజుకు భార్య రాధిక, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో డిగ్రీ చదువుతున్న గాయత్రి, బీటెక్ చదువుతున్న నికిత, ఇంటర్ చదువుతున్న గణేష్ పిల్లలు.

పొలంలోనే శవమై..
పొలం వద్దకు వెళ్లిన కృష్ణంరాజు శనివారం పొద్దుపోయినా ఇంటికి రాలేదు. దీంతో కలవరం చెందిన ఆయన కుటుంబీకులు పొలం వద్దకు వెళ్లే సరికి, శరీరం నుజ్జునుజ్జుగా మారిన స్ధితిలో కృష్ణంరాజు శవమై కనిపించాడు. దీంతో ఆయన కుటుంబీకులు పొలం వద్ద కన్నీటిపర్యంతం అయ్యారు. గ్రామస్తుల కథనం మేరకు, కొత్తూరుకు సమీపంలోని అటవీప్రాంతంలో ఏనుగుల మంద మూడు రోజులుగా సంచిస్తున్నట్లు తెలుస్తోంది.
కదలని కుంకీలు
చిత్తూరు జిల్లాలోని పడమటి తాలూకాల్లో ఏనుగుల దాడులు సర్వసాధారణంగా మారాయి. పొలాలు, గ్రామాల పక్కకు ఏనుగుల మంద వచ్చినప్పుడు సమాచారం అందుకునే అటవీశాఖ స్పందిస్తోంది. దీనికోసం కుప్పం సమీపంలోని ననియాల వద్ద రెండు సుక్షిత ఏనుగులు దీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నాయి.
పడమటి ప్రాంతంలోని అడవులు నుంచి గ్రామాల్లోకి ఏనుగులు వస్తే, వాటిని కుంకీ ఏనుగుల ద్వారా నియంత్రించే వారు. ప్రస్తుతం కుప్పంలోని రెండు కుంకీ ఏనుగులకు వయసు మీద పడినట్లు తెలుస్తోంది.
డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ ఏనుగుల దాడుల నుంచి పంటలు, రైతుల ప్రాణాలు కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కర్ణాటక నుంచి ఇటీవల ఆరు కుంకీ ఏనుగులు తీసుకుని రావడంలో సఫలం అయ్యారు. వాటిలో రెండు ఏనుగులు తిరుపతి జూ పార్కులోనూ, పలమనేరు సమీపంలోని ముసలిమడుగు క్యాంపులో మరో నాలుగు ఏనుగులు ఇంకా శిక్షణలో ఉన్నాయి. కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చిన మావటీలు, స్థానిక మాటీలతో దగ్గర చేసే దిశగా శిక్షణ ఇస్తున్నారు. మినహా, కార్యరంగంలోకి దించలేదు. దీంతో గ్రామాల వైపు అడవుల నుంచి వస్తున్న మదపుటేనుగులతో రైతుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. పంట నష్టాలకు కూడా హద్దు లేకుండా ఉంది. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించకుంటే, ఇంకొందరి ప్రాణాలు ప్రమాదంలో పడే పరిస్థితి కనిపిస్తోంది.
Read More
Next Story