అర్ధరాత్రి వరకు కలక్టరేట్‌లోనే సీఎం.. పర్యటనల్లో మంత్రులు బిజీబిజీ
x

అర్ధరాత్రి వరకు కలక్టరేట్‌లోనే సీఎం.. పర్యటనల్లో మంత్రులు బిజీబిజీ

విజయవాడ ముంపు ప్రాంతాల్లో వరద సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు అధికారులు. ప్రతి ఒక్కరికీ ఆహారం, తాగు నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.


విజయవాడ ముంపు ప్రాంతాల్లో వరద సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు అధికారులు. ప్రతి ఒక్కరికీ ఆహారం, తాగు నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యలను సీఎం చంద్రబాబు, మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా జాప్యం, అలసత్వం జరగకుండా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. రెండు రోజులు సీఎం చంద్రబాబు వరద ప్రభావి ప్రాంతాల్లో పర్యటిస్తున్న ప్రజల సమస్యలను స్వయంగా ఆలకిస్తున్నారు. వారి సమస్యల పరిష్కారానికి యుద్దప్రాతిపదికన చర్యలు కూడా చేపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి 2 గంటల వరకు ఆయన సెక్రటేరియట్‌లోనే ఉన్నారు. సహాయక చర్యలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటూనే ఉన్నారు. కలెక్టరేట్ దగ్గర బస్సులోనే బస చేశారు. అర్ధరాత్రి 2 గంటల తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లారు. మంత్రి నారా లోకేష్ కూడా అర్ధరాత్రి వరకు సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ కలెక్టరేట్‌లోనే ఉన్నారు. వీరితో పాటు పలువురు ఇతర మంత్రులు కూడా సహాయక చర్యలపై దృష్టి సారించి ఉన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

అర్ధరాత్రి వరకు మంత్రుల పర్యటన

ఇందులో భాగంగా ఒక వైపు వర్షం, మరోవైపు వరద ఉధృతి భారీ ఉన్నప్పటికీ మంత్రులు వెనకడుగు వేయకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడి పరిస్థితులను ఆరా తీస్తున్నారు. అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ సోమవారం అర్ధరాత్రి వరకు కూడా పర్యటనల్లో బిజీబిజీగా ఉన్నారు. ప్రతి ప్రాంతంలోని అందుతున్న సహాయక చర్యలపై వాళ్లు ఆరా తీస్తూనే ఉన్నారు. ఎక్కడిక్కడ సమస్యలను పరిష్కరించే దిశగా వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని, అన్ని విధాలా వారికి రక్షణ కల్పిస్తుందని వరద బాధితులకు భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగానే అందరికీ ఆహారం అందుతున్నా లేదన్న అంశాలను కూడా వారి పర్యవేక్షించారు. వరద బాధితులకు అందిస్తున్న ఆహార విషయాన్ని మంత్రి పొంగూరు నారాయణ వివరించారు.

అందరికీ ఆహారం రెడీ..

వరద బాధితులు ప్రతి ఒక్కరికీ అందేలా ఆహార పొట్లాలను సిద్ధం చేస్తున్నట్లు పొంగూరి నారాయణ తెలిపారు. ఆహార పొట్లాలను డ్రోన్లు, హెలికాప్టర్ల సహాయంతో అందిస్తున్నట్లు చెప్పారు. ముంపు ప్రాంతాలకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నామని, ఏ ఒక్కరికీ కొరత లేని సంఖ్యలో ఆహార పొట్లాలను సిద్ధం చేశామని ఆయన చెప్పారు. హెలికాప్టర్ల సహాయంతో తాగునీరు, ఔషధాలను కూడా అందిస్తున్నట్లు ఆయన వివరించారు. సహాయక చర్యల్లో ఏమాత్రం లోటు లేకుండా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నామని, మరింత ప్రభావవంతంగా సహాయం అందించడానికి అదనపు బలగాలను కూడా సీఎం తెప్పిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

Read More
Next Story