బల్లకట్టుపై కాలువ దాటిన చంద్రబాబు.. తప్పిన పెను ప్రమాదం..
x

బల్లకట్టుపై కాలువ దాటిన చంద్రబాబు.. తప్పిన పెను ప్రమాదం..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన ఇంకా కొనసాగుతోంది. ప్రతి ప్రాంతానికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎనికేపాడు దగ్గర ఏలూరు కాలువ దాటి వెళ్లి ముంపు ప్రాంతాలను సందర్శించారు.


వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన ఇంకా కొనసాగుతోంది. ప్రతి ప్రాంతానికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎనికేపాడు దగ్గర ఏలూరు కాలువ దాటి వెళ్లి ముంపు ప్రాంతాలను సందర్శించారు. అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కాలువ దాటడానికి చంద్రబాబు బల్లకట్టుపై ప్రయాణించారు. ముంపు ప్రాంతాల్లో వరద ఉధృతి గురించి అధికారులను ఆరా తీశారు. దెబ్బతిన్న పంటల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ఆయన ముధరా నగర్ రైల్వే ట్రాక్‌ను సందర్శించారు. ఈ పర్యటనలో చంద్రబాబుకు పెను ప్రమాదం మూడుడగుల దూరంలో ఆగింది. సీఎం పర్యటనకు వెళ్తుంటే కనీస భద్రత చర్యలు తీసుకోరా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రమాదపు అంచుల వరకు వెళ్లడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని వాదనలు వినిపిస్తున్నాయి.




ఇంతకీ ఏమైందంటే..

ముధరా నగర్ రైల్వే ట్రాక్ సందర్శనకు వెళ్లిన చంద్రబాబు.. ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో ఆ ట్రాక్‌పై ట్రైన్ రావడాన్ని భద్రతా సిబ్బంది గమనించి అలెర్ట్ అయ్యారు. అనంతరం లైన్‌మ్యాన్ అలెర్ట్ అయి.. ఎర్రజెండా ఊపడంతో ట్రైన్ ఆగిపోయింది. ఈ ట్రైన్ చంద్రబాబుకు మూడు అడుగుల దూరంలో ఆగడంతో పెను ప్రమాదం తృటిలో తప్పినట్లయింది. వెంటనే భద్రతా సిబ్బంది చంద్రబాబును అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయారు. సీఎం చీఫ్ సెక్యూరిటీ అధికారి మధుబాబు కూడా అక్కడే ఉన్నారు.

అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..

పర్యటన అనంతం అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ అంతటా మళ్ళీ వర్షం మొదలైన క్రమంలో ఈసారి ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదని, ముందుగానే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. అదే విధంగా ఈసారి వరదలను నియంత్రించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం వరద ప్రభావం తగ్గినందున ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రాజెక్ట్‌లకు పడిన గండ్లను పూడ్చే పనులను శరవేగంగా పూర్తి చేయాలని చెప్పారు.

Read More
Next Story