
సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు (ఫైల్)
కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంక పక్కా లోకల్
కుప్పంలో సీఎం 21వ తేదీ తిరుపతి గంగమాంబకు మొదటిసారి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 25న సొంత ఇంటిలో చేరనున్నారు.
కుప్పం పట్టణం పాతపేటలోని ప్రసన్న తిరుపతి గంగమాంబకు సీఎం ఎన్. చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. జాతర సందర్భంగా ఆయన 21వ తేదీ కుప్పం పర్యటనకు రానున్నారు.
పాతపేటలోని గంగమ్మ ఆలయం తోపాటు హెలిపాడ్, ముందస్తు భద్రతా ఏర్పాట్లపై సోమవారం మధ్యాహ్నం సమీక్షించారు. ఆ ప్రాంతాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలుతో కలిసి పరిశీలించారు.
కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంకడపల్లె పంచాయతీ శివపురం గ్రామంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన భవనం నిర్మించారు. ఇక్కడ గృహ ప్రవేశం చేయడానికి 25వ తేదీ సీఎం చంద్రబాబు రెండు రోజుల పర్యటనకు కుటుంబ సమేతంగా రానున్నారు. చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లెకు చెందిన సీఎం చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గంతో విడదీయలేని అనుబంధం ఏర్పడింది.
1978లో ఆయన చంద్రగిరి నుంచి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983లో టీడీపీలో చేరకుండా చంద్రగిరి నుంచే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రబాబు టీడీపీ అభ్యర్థి మేడసారి వెంకట్రామానాయుడు చేతిలో ఓటమి చెందారు. ఆ తరువాత టీడీపీలో చేరారు.
కుప్పంకు మారిన మజిలీ..
ఎన్. చంద్రబాబునాయుడు తన రాజకీయ మజిలీని కుప్పంకు మార్చుకున్నారు. మొదటిసారి ఆయన 1989లో కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి ఓటమి అంటే తెలియని విధంగా 2024 ఎన్నికల వరకు ఆయన ఎనిమిది ఎన్నికల్లో వరుస విజయాలకు కుప్పం ప్రాంత ఓటర్లు పట్టం కడుతున్నారు. అందుకు ప్రధానంగా అక్కడి ప్రజలతో మమేకం కావడమే అనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. అంతేకాకుండా, కుప్పంలో నేతలు, నాయకులను ఏకతాటిపై నడిపించారు. కార్యకర్తలను సుక్షిత సైనికులుగా మార్చుకోవడంలో సమర్థవంతమైన నాయకులను తయారు చేయడం ద్వారా ప్రతి గ్రామం నుంచి నాయకులతో నేరుగా సంబంధాలు ఏర్పరుచుకున్నారు. ఆ విధంగా నారావారిపల్లెకు మంచి కుప్పం ప్రాంత ప్రజలతో మమేకం అయ్యారు.
సొంత ఇంటితో... విమర్శలకు చెక్
కుప్పంలో సీఎం చంద్రబాబు సొంతింటి కల సాకారం చేసుకున్నారు. కుటుంబ సమేతంగా హాజరయ్యే ఆయన ఈ నెల 25వ తేదీ గృహ ప్రవేశం చేసే అవకాశం ఉంది.
కుప్పం నుంచి ఇప్పటికి ఎనిమిదిసార్లు సీఎం చంద్రబాబు విజయం సాధించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్ష నేతగా వచ్చినా ఆయన కుప్పంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేసేవారు.
"కుప్పం ప్రజలు ఇన్నిసార్లు ఆదరించారు. చంద్రబాబుకు కుప్పంలో సొంత ఇల్లు లేదు" అనేది వైసీపీ సంధించిన ఆరోపణలు. దీనికి సమాధానం చెప్పాలని మూడేళ్ల కిందట సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద సీఎం చంద్రబాబు మూడేళ్ల కిందట సొంత ఇంటి నిర్మాణం ప్రారంభించారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి, వారి కొడుకు నారా లోకేష్ కుప్పం పర్యటనకు వచ్చిన సందర్భాల్లో నిర్మాణ పనులు పర్యవేక్షించారు.
అధికారంలో లేని సమయంలో కూడా కుప్పంలో తిరుపతి గంగమాంబ జాతర, పార్టీ వ్యవహారాలు చూడడానికి వచ్చిన సందర్భాల్లో నారా భువనేశ్వరి తమ ఇంటి నిర్మాణ పనులు పరిశీలించడం, అవసరమైన మార్పులు, సూచనలు చేసేవారని అక్కడి టీడీపీ నేతలు చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు సొంత ఇల్లు, పార్టీ కార్యాలయం కూడా అందుబాటులోకి రానుంది.
ఏర్పాట్ల పరిశీలన
కుప్పంలో ఈ నెల 21వ తేదీ సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలుతో కలిసి పరిశీలించారు. ఆ రోజు సీఎం ఎన్. చంద్రబాబు తిరుపతి ప్రసన్న గంగమాంబ గంగ జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఎంఎల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు.
కుప్పంలో ముందస్తు ఏర్పాట్లపై అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజనింగ్ (ఏఎస్ఎల్)లో భాగంగా గుడిపల్లి మండలం ద్రవిడ యూనివర్సిటీ మైదానంలో హెలిపాడ్, బ్యారికేటింగ్ ఏర్పాటు అంశాలపై ఎస్పీ మణికంఠ చందోలు అధికారులతో సమీక్షించారు.
పాతపేటలోని ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయం వద్ద చేయాల్సిన ఏర్పాట్లపై ఆలయ చైర్మన్ రవిచంద్రబాబుకు సూచనలు ఇచ్చారు. వారి వెంట టిటిడి పాలక మండలి సభ్యులు వైద్యం శాంతారామ్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ నందకిషోర్, పిఆర్ ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి, డీటీసీ నిరంజన్ రెడ్డి, కుప్పం ఆర్డిఓ శ్రీనివాసరాజు, ఏఆర్ డిఎస్పి మహబూబ్ బాషా, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రావు అధికారులు
ఉన్నారు.
ఉన్నారు.
Next Story