‘సీఎం వచ్చినా మొద్దు నిద్ర వదలారా’.. అధికారులపై బాబు అసహనం
x

‘సీఎం వచ్చినా మొద్దు నిద్ర వదలారా’.. అధికారులపై బాబు అసహనం

విజయవాడలో ఉధృతంగా ఉన్న వరద సహాయక చర్యల్లో అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో వంటబట్టిన అలసత్వాన్ని అధికారులు ఇకనైనా వదిలించుకోవాలని, లేకుంటే సహించే ప్రసక్తే లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.


విజయవాడలో ఉధృతంగా ఉన్న వరద సహాయక చర్యల్లో అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో వంటబట్టిన అలసత్వాన్ని అధికారులు ఇకనైనా వదిలించుకోవాలని, లేకుంటే సహించే ప్రసక్తే లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలు, ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన అనంతరం నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వరదల ఉధృతి ఇంత తీవ్రంగా ఉన్నా, మరో వాయుగుండం హెచ్చరిక వచ్చినా కొందరు అధికారుల్లో నిర్లక్ష్య ధోరణి పోలేదంటూ మండిపడ్డారు. మునిగింద తమ ఇల్లు కాదుగా అన్న రీతిలో వారి ప్రవర్తన ఉందన్నారు. అధికారుల ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా నడుచుకోవాలని, స్వయంగా సీఎం హోదాలో ఉన్న తానే రంగంలోకి దిగినా కొందరు తమ మొద్దునిద్రను వీడలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఉంటే ప్రజలకు ఏమాత్రం సేవల చేయగలరంటూ క్లాస్ తీసుకున్నారు. వరద బాధితులకు అవసరమైన స్థాయిలో ఆహారం సిద్ధం చేయించగలిగినా, దాని పంపిణీ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు.

వారివల్లే ఆలస్యం

బుడమేరు ముంపు ప్రాంతాల్లో డ్యూటీలో ఉన్న కొందరు అధికారుల వల్లే ఆహార పంపిణీలో జాప్యం జరిగిందని సీఎం దృష్టికి వచ్చింది. ఈ అంశంపై మాట్లాడిన మంత్రి.. నాడు వైసీపీ హయాంలో జగన్ భక్త అధికారులుగా ముద్రపది, వైసీపీతో అంటకాగిన కొందరు అధికారులు డ్యూటీలో ఉన్న ప్రాంతాల్లోనే ఈ జాప్యం అధికంగా కనబడుతోందని సదరు మంత్రి.. సీఎంకు వివరించారు. వారు ఉద్దేశపూర్వకంగానే ఆహార పంపిణీని ఆలస్యం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన క్షేత్రస్థాయి పర్యటనలో పరిశీలించిన పలు అంశాలను రాసుకుని వచ్చి మరీ సీఎం చంద్రబాబు.. సమావేవంలో వాటిని ఎత్తి చూపారు. అనంతరం సదరు అధికారులు డ్యూటీలో ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన ఆహార పంపిణీ, సహాయక చర్యలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

హెల్ప్‌లైన్ నెంబర్లు ఇవే..

ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద ఉధృతిని చంద్రబాబు స్వయంగా వెళ్లి పరిశీలించారు. బ్యారేజ్ గేట్లను పడవలు ఢీకొట్టిన ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. గేట్ల మరమ్మతులకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో అక్కడే మాట్లాడారు. ఆ చర్యలు వీలైనంత త్వరగా చేపట్టాలని ఆదేశాలిచ్చారు. చంద్రబాబు పర్యటన అనంతరం విజయవాడలో వరద బాధితులకు సాయం అందించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను అధికారులు విడుదల చేశారు. బాధితులు తమ ఇబ్బందులను 8181960909, 0866-2424172, 0866-2575833, 18004256029 కాల్ చేసి తెలపొచ్చని అధికారులు వివరించారు.

అమరావతి సేఫ్: నిమ్మల రామానాయుడు

కృష్ణా నదిలో ఇంత వరదనీరు చేరడం తాను ఎప్పుడూ చూడలేదని, ఇదే తొలిసారి అని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. 1998, 2009లో కూడా ఇంతటి వరద రాలేదన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంతటి వరద వస్తున్న క్రమంలో అమరావతి కూడా మునిగిపోవచ్చంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. అటువంటిది ఏమీ జరగదని హామీ ఇచ్చారు. ‘‘అమరావతి ముంపు ప్రాంతమనే జగన్ కలను సాకారం చేయడానికి కొందరు తెగ కృషి చేస్తున్నారు. కొన్ని పేటీఎం బ్యాచ్‌లు, పెయిడ్ ఛానళ్లు ఈ విధంగా తీవ్ర దుష్ఫ్రచారం చేస్తున్నాయి. 11.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు పోటెత్తినా అమరావతి చెక్కు చెదరలేదు. అమరావతిపై వస్తున్న తప్పుడు వార్తలను నమ్మొద్దు. అమరావతిపై విషం చిమ్మడం వైసీపీకి బాగా అలవాటైపోయింది. రాజధాని అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదు’’ అని స్పష్టం చేశారు నిమ్మల రామానాయుడు.

Read More
Next Story