ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రారంభిస్తూ మొదటి సిలీండర్‌ను అందజేసిన మహిళ ఇంట్లో టీ కాచి ఆశ్చర్యపరిచారు.
ఉచిత గ్యాస్ దీపం 2 పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఉచితంగా అందజేసిన గ్యాస్ సిలీండర్‌పై టీ కాచి పలువురిని ఆశ్చర్యపరిచారు. దీపం 2 పథకం శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో సోమవారం ప్రారంభించారు. అంబటి శాంతమ్మ మహిళ ఇంటికి నేరుగా ఇంటికెళ్లిన సీఎం చంద్రబాబు ఉచిత గ్యాస్ సిలీండర్‌ను ఆమెకు అందించి సిలీండర్‌ను స్టౌవ్‌కు బిగించి, స్టౌవ్‌పై పాల గిన్నె పెట్టి టీని తయారు చేశారు. పాలు బాగా మరిగిన తర్వాత టీ పొడి గిన్నెలో వేసిన ముఖ్యమంత్రి టీ పొడి మరిగిన తర్వాత తయారైన టీని వడపోసి మహిళ కుటుంబ సభ్యులతో కలిసి టీ తాగారు. దీంతో ఆ కుటుంబ సభ్యుల్లో అంతులేని ఆనందం వెల్లువెరిసింది. పక్కనే ఉన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని పలకరిస్తూ.. మనం ఇలా ఉచిత గ్యాస్ వంటి పథకాలు ఇవ్వాలంటే కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొని రావాలని చమత్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, పలువురు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.