మరో సారి సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. ఎలాంటి ప్రకటనలు చేస్తారో అని ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో సారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీలో రేపు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఆర్థిక శాఖ మంత్రిని కూడా కలవనున్నారు. అంతేకాకుండా రేపు ఢిల్లీలో లీడర్షిప్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ప్రముఖ ఆంగ్ల పత్రిక హిందూస్థాన్ టైమ్స్ నిర్వహిస్తున్న లీడర్షిప్ సమ్మిట్లో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడ నుంచి కూటమి ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం మహారాష్ట్రకు వెళ్తారు. అక్కడ రెండు రోజుల పాటు ఎన్టీఏ కూటమి అభ్యర్థుల గెలుపునకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారం చేయనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
Next Story