ఇంటిపోరు.. ఇంతింత కాదయా!?
x
Source: Twitter

ఇంటిపోరు.. ఇంతింత కాదయా!?

జన సంక్షేమం గురించి ఆలోచించే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంట్లో సమస్యలు చెవిలో జోరీగలా రొద చేస్తున్నాయి. ఈ సమస్య ఎలా అధిగమిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న!


ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్ - తిరుపతి


"శత్రువును కూడా క్షమించా" అని శాసనసభలో దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి చెప్పిన మాట ఇది. రాజకీయ శత్రువులను మిత్రులుగా చేసుకోవడంలో ఆత్మీయత ప్రదర్శించారు. "కోపమనే నరాన్ని కూడా తెంచేసుకున్నాను" అని ఆయన చెప్పిన మాటలను ఓ నాయకుడు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. "శత్రువులు బయటే కాదు. ఇంట్లో అన్నదమ్ములు, అక్కచెల్లెలు, తల్లి, భార్య రూపంలో కూడా తిరుగుతుంటారు" అనే సినిమా డైలాగు సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డికి అక్షరాల వర్తించేలా.. ఉంది అంటున్నారు. .ఒక రాజకీయ శత్రువును మిత్రుడిగా చేరదీసిన ఆయనకు.. ఇంట్లో శత్రువులు చెవులో జోరీగలా మారారా? ఈ పరిస్థితిలో తండ్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసుడుగా రాజకీయ శత్రుత్వం నిర్మూలన వ్యూహం ఎలా ఉంటుందనేది సమాధానం దొరకని ప్రశ్నగా మారింది.

అది 1989 సంవత్సరం.. మే 23వ తేదీ.
కారులో ఇడుపులపాయకు వెళుతున్న పులివెందల మాజీ సర్పంచ్ వైఎస్ రాజారెడ్డి వేంపల్లి వద్ద హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న వేంపల్లి చెందిన టిడిపి నాయకుడు ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి నిందితుడు. పరిస్థితులు అనుకూలించి , 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, సీఎంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో ఆయన ప్రకటించింది ఒకటే.. " శత్రువును కూడా క్షమించా," అనే మాటతో వర్గ రాజకీయాలకు స్వస్తి చెపుతున్నట్లు విస్పష్టంగా ప్రకటించారు.

అన్నట్లుగానే...
1989, 94లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందిన డాక్టర్ సదాశివరెడ్డి తోపాటు భార్య జ్యోతి రెడ్డినీ కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నారు. సింహాద్రిపురం మండలం నుంచి జ్యోతి రెడ్డిని ఏకగ్రీవంగా గెలిపించి ఏకంగా కడప జడ్పీ చైర్ పర్సన్ హోదాలో కూర్చోబెట్టారు. కడప జిల్లా రైల్వే కోడూరు లో శత్రువుగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన బత్యాల చెంగల్రాయలుకు (బిసిఆర్.. ప్రస్తుతం టిడిపి) ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టడం ద్వారా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన రాజకీయ చతురత ప్రదర్శించారు. " కోపమనే నరాన్ని కూడా తెంచేసుకున్నాను. శత్రువు అనే పదాన్ని మింగేశాను అని" కూడా రాజశేఖర్ రెడ్డి చెప్పిన మాటలను కడప జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఔన్నత్యాన్ని గుర్తు చేశారు. డాక్టర్ వైయస్సాఆర్ తో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పోల్చడం అంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా అన్నారు.

ఇంట్లోనే శత్రువులు...!

కడప జిల్లా పులివెందుల తాలూకా వేంపల్లి కు చెందిన టిడిపి మాజీ ఎమ్మెల్సీ ఎస్ వి సతీష్ రెడ్డిని పార్టీలోకి తీసుకున్నంత మాత్రాన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాస్త ఊరటగా అనిపించవచ్చు. వైయస్సార్ కుటుంబం నుంచి అజాతశత్రువుగా మెలిగే మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో... సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంట్లోనే శత్రువులు పెరిగిపోయారు. నా ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అని వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె నరెడ్డి సునీతా రెడ్డి ఢిల్లీ స్థాయిలో పోరాటం సాగిస్తున్నారు. సునీత రెడ్డికి అండగా నిలబడడంతో పాటు, పి సి సి సారధ్య బాధ్యతలు చేపట్టిన వైయస్ షర్మిల రెడ్డి తన సొంత అన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు, ప్రశ్నలు, మాట మడమ తిప్పారంటూ తూర్పారబడుతున్నారు. ఇవన్నీ విరసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంటి సమస్యలే చికాకుగా మారాయి.


Read More
Next Story