‘ఆంధ్ర ఫలితాలు చూసి దేశం ఆశ్చర్యపోతుంది’.. ఐప్యాక్ టీమ్‌తో జగన్
ఆంధ్ర సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఐప్యాక్ టీమ్‌ను కలిశారు. విజయవాడలోని ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఆ టీమ్ వారితో ముచ్చటించారు.
ఆంధ్ర సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఐప్యాక్ టీమ్‌ను కలిశారు. విజయవాడలోని ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఆ టీమ్ వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూన్ 4న విడుదలయ్యే ఆంధ్ర ఎన్నికల ఫలితాలు చూసి భారతదేశమంతా ఆశ్చర్యపోనుందని, అందులో ఎటువంటి సందేహం అక్కరలేదని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్ జగన్‌కు ఐప్యాక్ టీమ్ ఘన స్వాగతం పలికింది. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు.. టీమ్ కేరింతలు, హర్షద్వానాలతో ఆడిటోరియం దద్దరిల్లింది.
YSJagan with IPAC Team 👌
— YSRCP USA SM (@YSRCPUSASM) May 16, 2024
రేపు ఫలితాలు చూసి దేశం మొత్తం షాక్ అవుతుంది!! 🙏#YSRCPWinningBig pic.twitter.com/WN5SAaVKU5
ఈసారి 175 పక్కా
‘‘2024 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు దేశంగా ఆంధ్రవైపే చేస్తుంది. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 21 ఎంపీ స్థానాలు గెలిచాం. కానీ ఈసారి వైసీపీ గెలుపు రికార్డు స్థాయిలో ఉండనుంది. ఈసారి మనం 151 అసెంబ్లీ స్థానాలు, 21 లోక్‌సభ స్థానాలను అధిగమిస్తాం. ఈసారి అంతకుమించి ఎక్కువ స్థానాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుంది. దేవుడి దయవల్లా నేను మంచి పరిపాలనను అందించాను. అదే విధంగా ఒకటిన్నర ఏడాదిగా మీరు అందించిన సహకారం అద్భుతం. మనం సాధించిన అన్ని కార్యాలను ప్రజల ముందుకు తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించారు. మేము మా లక్ష్యాన్ని సాధించడానికి మీరు ఎంతగానో సహాయం చేశారు.