జగన్ నామినేషన్ డేట్ ఛేంజ్.. ఎప్పుడంటే..
x

జగన్ నామినేషన్ డేట్ ఛేంజ్.. ఎప్పుడంటే..

సీఎం జగన్ నామినేషన్ దాఖలుపై క్లారిటీ వచ్చింది. మేమంతా సిద్ధం బస్సు యాత్రను ముగించుకున్న తర్వాతే ఆయన పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.


(శివరామ్)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పులివెందులలో ఈ నెల 25న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 18న నామినేషన్ల దాఖలుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. అయితే మొదట జగన్ నామినేషన్ దాఖలు కార్యక్రమం 22వ తేదీన ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు శ్రీకాకుళంలో 24న ఉండడంతో ఆ తరువాతే నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనుకున్న ప్రకారం పులివెందులలో 22వ తేదిన జగన్ తరపున కడప ఎంపీ అవినాష్ రెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు.

24 వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిసిన తర్వాత అక్కడ నుంచి నేరుగా జగన్ మోహన్ రెడ్డి పులివెందుల చేరుకొని, 25వ తేదీన మరో సెట్ నామినేషన్ వేయనున్నారు. పులివెందులలో జగన్ మోహన్ రెడ్డి ప్రచార బాధ్యతలు ఆయన సతీమణి భారతి రెడ్డి స్వీకరించనున్నారు. 25న నామినేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే సీఎం జగన్ మోహన్ రెడ్డి మలివిడత ప్రచారం మొదలు పెడతారు. ఇందులో భాగంగా 27 లేదా 28 వ తేదీన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు.

Read More
Next Story