కలెక్టర్ లు ప్రాక్టికల్ గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.
రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుచున్న మూడవ జిల్లా కలెక్టర్ల సమావేశం 2 వ రోజు జోన్-5 లోని వైయస్సార్ కడప మరియు కర్నూలు జిల్లాల 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జిల్లా ప్రగతి ప్రణాళికలను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు సమీక్షిస్తూ...
జిల్లా కలెక్టర్ల స్థాయిలో పరిష్కరించ దగిన సమస్యల మినహా పాలసీ విధానాలకు సంబంధించిన సమస్యలను మాత్రమే ప్రభుత్వం దృష్టికి తేవాలి.
జిల్లా కలెక్టర్లు థియారిటికల్ గా ఆలోచించవద్దు, క్రియేటివ్ గా మాత్రమే ఆలోచిస్తూ డ్రోన్ టెక్నాలజీని ఇంతవరకు ఏయే రంగంల్లో ప్రత్యేకించి వ్యవసాయ రంగంలో ఏ మేరకు ఉపయోగించి అభివృద్ధిని సాధించారో, వాటి కేస్ స్టడీస్ ను సమావేశంలో వివరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలి.
రాష్ట్ర మానవనుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపినట్లుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో వర్డ్చల్ టీచింగ్ విధానం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని, ప్రస్తుతం 80% పాఠ శాలల్లో మాత్రమే అమరవుతున్నదని, మిగిలిన 20% పాఠశాలలో కూడా ఈ విధానాన్ని అమలులోకి తేవాలి.
వైయస్సార్ కడప జిల్లా కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాష వారి జిల్లాల జిల్లా ప్రగతి ప్రణాళికలను మరియు ప్రభుత్వ దృష్టికి తీసుకు రావాల్సిన నిర్ధిష్ట సమస్యలను ఈ సమావేశంలో వివరించారు.
Next Story