కాంగ్రెస్ తొలి జాబితా వచ్చేసింది... అభ్యర్థులు వీరే..
x
Source: Twitter

కాంగ్రెస్ తొలి జాబితా వచ్చేసింది... అభ్యర్థులు వీరే..

కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేసింది. ఇందులో ఐదుగురు ఎంపీ, 114 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు.


ఆంధ్ర ఎన్నికల్లో తమ పార్టీ తరపున బరిలోకి దిగనున్న అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో ఐదుగురు ఎంపీ, 114 ఎమ్మెల్యే అభ్యర్థులను కాంగ్రెస్ వెల్లడించింది. ఈ జాబితాను కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. కాంగ్రెస్ ఆంధ్ర అధ్యక్షురాలు షర్మిల.. కడప ఎంపీ బరిలో తలపడనున్నారు. అతి త్వరలోనే మిగిలి స్థానాల అభ్యర్థులను కూడా ఖరారు చేసి జాబితా విడుదల చేసే విధంగా కాంగ్రెస్ కసరత్తులు చేస్తోందని, ఇప్పటికే ఆయా సీట్లకు టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల పేర్లను ఆంధ్ర కాంగ్రెస్.. పార్టీ హైకమాండ్‌కు అందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వారిపై ఇప్పటికే కాంగ్రెస్ జాతీయ ఎన్నికల కమిషన్ చర్చలు చేస్తున్నట్లు సమాచారం.


లోక్‌సభ అభ్యర్థులు వీరే..
కడప- వైఎస్‌ షర్మిల
బాపట్ల - జేడీ శీలం
కాకినాడ - పల్లం రాజు
కర్నూలు - రామ్‌ పుల్లయ్య యాదవ్‌
రాజమహేంద్రవరం - గిడుగు రుద్రరాజు

అసెంబ్లీ అభ్యర్థులు వీళ్లే..!
రాజాం(ఎస్సీ) - కంబాల రాజవర్ధన్‌
పాలకొండ (ఎస్టీ)- సరవ చంటిబాబు
పార్వతీపురం (ఎస్సీ)- బత్తిన మోహన్‌ రావు
సాలూరు (ఎస్టీ)- మువ్వల పుష్పారావు
చీపురుపల్లి - తుమ్మగంటి సూరినాయుడు
మాడుగుల - బీబీఎస్‌ శ్రీనివాసరావు
పాడేరు (ఎస్టీ) - శతక బుల్లిబాబు
అనకాపల్లి - ఇల్లా రామ గంగాధర రావు
ఇచ్ఛాపురం- ఎం.చక్రవర్తిరెడ్డి
పలాస- మజ్జి త్రినాథ్‌బాబు
పాతపట్నం- కొప్పురోతు వెంకటరావు
శ్రీకాకుళం- పైడి నాగభూషణ్‌ రావు
ఆమదాలవలస - సనపల అన్నాజీ రావు
ఎచ్చెర్ల - కరిమజ్జి మల్లేశ్వర రావు
నరసన్నపేట - మంత్రి నరసింహమూర్తి
పెందుర్తి - పిరిడి భగత్‌
పాయకరావుపేట(ఎస్సీ)- బోనీ తాతారావు
గజపతినగరం - గడపు కూర్మినాయుడు
విజయనగరం - సుంకరి సతీశ్‌ కుమార్‌
విశాఖ తూర్పు - గుత్తుల శ్రీనివాస రావు
తుని- జి. శ్రీనివాసరావు
ప్రత్తిపాడు- ఎన్‌వీవీ సత్యనారాయణ
పిఠాపురం- ఎం. సత్యానంద రావు
కాకినాడ రూరల్‌- పిల్లి సత్య లక్ష్మి
కాకినాడ సిటీ - చెక్క నూకరాజు
రామచంద్రాపురం - కోట శ్రీనివాస రావు
అనపర్తి- డా. యెల్ల శ్రీనివాసరావు
రాజోలు(ఎస్సీ) - ఎస్‌. ప్రసన్నకుమార్‌
కొత్తపేట - రౌతు ఈశ్వరరావు
మండపేట - కామన ప్రభాకర రావు
ముమ్ముడివరం- పాలెపు ధర్మారావు
అమలాపురం(ఎస్సీ)-ఐతాబత్తుల సుభాషిణి
పెద్దాపురం - తుమ్మల దొరబాబు
రాజానగరం - ముండ్రు వెంకట శ్రీనివాస్‌
రాజమండ్రి సిటీ - బోడ లక్ష్మీ వెంకట ప్రసన్న
పాలకొల్లు - కొలకలూరి అర్జునరావు
నరసాపురం - కానురు ఉదయ భాస్కర కృష్ణ ప్రసాద్‌
భీమవరం - అంకెం సీతారాము
ఉండి - వేగేశ వెంకట గోపాల కృష్ణ
తణుకు - కడలి రామారావు
తాడేపల్లిగూడెం - మరీదు శేఖర్‌
ఉంగుటూరు - పాతపాటి హరి కుమారరాజు
తిరువూరు (ఎస్సీ) - లాం తాంతియా కుమారి
రాజమండ్రి రూరల్‌ - బాలేపల్లి మురళీధర్‌.
జగ్గంపేట - మారుతి వీవీ గణేశ్వరరావు
కొవ్వూరు (ఎస్సీ) - అరిగెల అరుణ కుమారి
దెందులూరు - ఆలపాటి నర్సింహమూర్తి
పోలవరం (ఎస్టీ) - సుజన దువ్వెల
చింతలపూడి (ఎస్సీ) - వున్నమట్ల రాకాడ ఎలీజ
నిడదవోలు - పెద్దిరెడ్డి సుబ్బారావు
మచిలీపట్నం - అబ్దుల్‌ మతీన్‌
అవనిగడ్డ - అందే శ్రీరామమూర్తి
పామర్రు (ఎస్సీ) - డీవై దాస్‌
పెనమలూరు- ఎలిశాల సుబ్రహ్మణ్యం
నూజివీడు- మరీదు కృష్ణ
గుడివాడ - వడ్డాది గోవిందరావు
కైకలూరు- బొడ్డు నోబెల్‌
పెడన - శొంటి నాగరాజు
మైలవరం - బొర్రా కిరణ్‌
నందిగామ (ఎస్సీ)- మందా వజ్రయ్య
పెదకూరపాడు - పమిడి నాగేశ్వరరావు
తాడికొండ (ఎస్సీ) - చిలకా విజయ్‌ కుమార్‌
చిలకలూరిపేట - మద్దుల రాధాకృష్ణ
నరసరావుపేట -షేక్‌ మహబూబ్‌ బాషా
వినుకొండ - చెన్నా శ్రీనివాసరావు
ఒంగోలు - బి. రమేశ్‌ బాబు అలియాస్‌ బీఆర్‌ గౌస్‌
పొన్నూరు- జక్కా రవీంద్రనాథ్‌
వేమూరు (ఎస్సీ)- బుర్గా సుబ్బారావు
ప్రత్తిపాడు (ఎస్సీ) -కె.వినయ్‌ కుమార్‌
గుంటూరు తూర్పు - షేక్‌ మస్తాన్‌ వలీ
కందుకూరు - సయూద్‌ గౌస్‌ మొయిద్దీన్‌
కొండపి (ఎస్సీ) - శ్రీపతి సతీష్‌
మార్కాపురం - షేక్‌ సైదా
గిద్దలూరు - పగడాల పెద్ద రంగస్వామి
కనిగిరి - కదిరి భవాని
గురజాల -తియ్యగురల్ యలమందరెడ్డి
మాచర్ల - వై. రామచంద్రారెడ్డి
దర్శి - పొట్లూరి కొండా రెడ్డి
అద్దంకి - అడుసుమిల్లి కిశోర్‌బాబు
ఆత్మకూరు - చెవూరు శ్రీధర రెడ్డి
కొవ్వూరు -నెబ్రంబాక మోహన్‌
బద్వేల్‌ (ఎస్సీ) - నీరుగట్టు దొర విజయ జ్యోతి
కోడూరు (ఎస్సీ) - గోసల దేవి
రాయచోటి - షేక్‌ ఆల్లా బాషా
నందికొట్కూరు (ఎస్సీ)- తొగురు ఆర్థుర్‌
పీలేరు - బి. సోమశేఖర్‌ రెడ్డి
మదనపల్లి - పవన్‌ కుమార్‌ రెడ్డి
పుంగనూరు -డా. జి. మురళీ మోహన్‌ యాదవ్‌
చంద్రగిరి - కనుపర్తి శ్రీనివాసులు
శ్రీకాళహస్తి - డా. రాజేశ్‌ నాయుడు పోతుగుంట
సత్యవేడు (ఎస్సీ) - బాలగురువం బాబు
గుంతకల్‌ - కావలి ప్రభాకర్‌
తాడిపత్రి - గుజ్జల నాగిరెడ్డి
శింగనమల (ఎస్సీ) - సాకె శైలజానాథ్‌
రాప్తాడు - ఆది ఆంధ్ర శంకరయ్య
మడకశిర (ఎస్సీ) - కరికెర సుధాకర్‌
హిందూపూర్‌ - వి.నాగరాజుపెనుకొండ - నరసింహప్ప
పుట్టపర్తి - మధుసూదన్‌ రెడ్డి
కదిరి - కేఎస్‌ షాన్వాజ్‌
తంబళ్లపల్లి - ఎం.ఎన్‌. చంద్రశేఖర్‌ రెడ్డి
నంద్యాల్‌ - గోకుల కృష్ణారెడ్డి
కోడుమూరు (ఎస్సీ) - పరెగెళ్ల మురళీకృష్ణ
రాయదుర్గ్‌ - ఎంబీ చిన్న అప్పియ్య
ఉరవకొండ - వై. మధుసూదన్‌ రెడ్డి
నెల్లూరు రూరల్‌ - షేక్‌ ఫయాజ్‌
సర్వేపల్లి - పూల చంద్రశేఖర్‌
గూడూరు (ఎస్సీ) - వేమయ్య చిల్లకూరి
సూళ్లూరుపేట (ఎస్సీ) - గాది తిలక్‌బాబు
ఉదయగిరి - సోము అనిల్‌ కుమార్‌ రెడ్డి
నగరి - పోచరెడ్డి రాకేశ్‌ రెడ్డి
చిత్తూరు - జి.తికారామ్‌
పలమనేరు - బి. శివశంకర్‌
కుప్పం - ఆవుల గోవిందరాజులు (ఆవుల గోపీ)


Read More
Next Story