వైఎస్‌ షర్మిల వెంట కాంగ్రెస్‌ హేమాహెమీలు

ఏపీసీసీ అధ్యక్షురాలుగా తన కుమారుడి నిశ్చితార్థం ముగించుకుని షర్మిల శనివారం సాయంత్రం ఏపీకి చేరుకున్నారు. ఆమెతోపాటు కాంగ్రెస్‌ పార్టీ హేమాహేమీలు ఉండటం విశేషం.


వైఎస్‌ షర్మిల వెంట కాంగ్రెస్‌ హేమాహెమీలు
x
మీడియాతో మాట్లాడుతున్న షర్మిల

కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఎంపికైన తరువాత తన కుమారుడి నిశ్చితార్థం ముగించుకుని షర్మిల శనివారం సాయంత్రం ఏపీకి చేరుకున్నారు. ఆమెతోపాటు కాంగ్రెస్‌ పార్టీ హేమాహేమీలు ఉన్నారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఏపీసీసీ చీఫ్‌ షర్మిలరెడ్డి సాయంత్రం ఐదు గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు.



కడపలో విమానాశ్రయంలో ఘన స్వాగతం
కడప విమానాశ్రయంలో షర్మిలకు ఘన స్వాగతం లభించింది. జిల్లాలోని కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులు విమానాశ్రయానికి చేరుకున్నారు. గజమాలతో కాంగ్రెస్‌ అభిమానులు ఆమెను సన్మానించారు. ప్రతి ఒక్కరూ పూల మాలలు, కండువాలు, శాలువాలు కప్పి ఆహ్వానించారు. హైదరాబాద్‌ నుంచి బయలుదేరేటప్పుడు ఆమె వెంట కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు కేవీపీ రామచంద్రరావు, ఎన్‌ రఘువీరారెడ్డిలు విమానంలోనే కడపకు చేరుకున్నారు. విమానాశ్రయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డాక్టర్‌ ఎన్‌ తులసిరెడ్డి ఆమె వెన్నంటే ఉన్నారు.

వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి
అక్కడి నుంచి నేరుగా ఇడుపులపాయ చేరుకున్న షర్మిల తన తండ్రి వైఎస్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. ఆమెతోపాటు వైఎస్‌కు నివాలులర్పించిన వారిలో కేవీపీ రామచంద్రరావు, ఎన్‌ రఘువీరారెడ్డి, డాక్టర్‌ శైలజానాథ్, డాక్టర్‌ ఎన్‌ తులసిరెడ్డిలు ఉన్నారు. వైఎస్సార్‌ అభిమానులతో వైఎస్సార్‌ ఘాట్‌ కిక్కిరిసింది.
కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి
ఘాట్‌ వద్దకు వచ్చిన మాజీ మంత్రి అహ్మదుల్లా పీసీసీ చీఫ్‌ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కాంగ్రెస్‌లోకి చేరికలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. స్వరీయ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్సార్‌ ఆశయాల సాధన కోసం తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు ప్రకటించారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేసే వరకు పోరాటం ఆపేది లేదని చెప్పడం విశేషం. నమ్మిన సిద్దాంతాల కోసం వైఎస్సార్‌ ఎంత దూరమైనా వెళ్లేవాడు. ఇవ్వాళ సెక్యులరిజం, ప్లూరలిజం అనే పదాలకు అర్థం లేకుండా పోయింది. రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది. భారత దేశానికి మంచి జరిగే వరకు పోరాడుతూనే ఉంటానన్నారు.
Next Story