congrss office vijayawada
ఏపి కాంగ్రెస్‌కు జవసత్వాలు ఈ ఎన్నికల్లో వస్తాయా..స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల ఏపి చీఫ్ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌కు ఒక ఊçపొచ్చిందని చెప్పొచ్చు.
వైఎస్ షర్మిల అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాలను కూడా చీల్చి చెండాడుతోంది. ప్రధానంగా అధికార పక్షాన్ని ముప్పి తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. సొంత సోదరుడైనా రాష్ట్రానికి ఏమి చేశావన్నా అంటూ నిలదీస్తోంది. మొదటి కాంగ్రెస్‌ను అంటి పెట్టుకొని ఉన్న సీనియర్ నాయకులకు ఈ విధానం బాగా నచ్చింది.
వేలల్లో దరఖాస్తులు
2024 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆ«ర్థికంగా బలమున్న నాయకులు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటి వరకు టికెట్ల కోసం దాదాపు 1500 మంది వరకు దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో సీనియర్ నాయకులు కూడా ఉండటం విశేషం. అయితే ఈ సీనియర్ నాయకులకు సీట్లు దక్కుతాయా? ఆర్థికంగా బలమున్న వారిని పార్టీ ఎంపిక చేస్తుందా? అనేది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సీనియర్లు రంగంలోకి దిగితేనే ఫలితముంటుంది
దరఖాస్తులు చేసుకున్న సీనియర్ నాయకులకు ఆర్థిక బలం లేదనే చర్చ ఆ పార్టీలో సాగుతోంది. ఆర్థిక బలం లేకుంటే ఈ ఎన్నికలను ఎదుర్కోవడం సాధ్యం కాదనే ఆలోచనలు కూడా ఆ పార్టీ కేంద్ర నాయకుల్లో ఉంది. అయితే సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, రాజ్యసభ మాజీ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, మాజీ రాష్ట్ర మంత్రి, రాష్ట్ర విభజనలో రాష్ట్రానికి మొదటి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు రఘువీరా రెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, గిడుగు రుద్రరాజు, కొప్పుల రాజు, డాక్టర్ తులసి రెడ్డి, టి సుబ్బిరామిరెడ్డి, కనుమూరి బాపిరాజు, లగడపాటి రాజగోపాల్, జంగా గౌతమ్, దుట్టా రామచంద్రరావు వంటి నాయకులు పార్లమెంటు స్థానాల్లో కానీ ముఖ్యమైన అసెంబ్లీ స్థానాల్లో కానీ పోటీలోకి దిగితే కాంగ్రెస్ బలం మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అవసరమైతే వీరికి ఆర్థిక భారాన్ని కాంగ్రెస్ పార్టీనే మోయాల్సి రావచ్చనే అభ్రిపాయం కూడా ఉంది. పూర్తి చచ్చిపోయిన కాంగ్రెస్‌ను ఏపిలో బతికించుకోవాలంటే ఇంత కంటే వేరే మార్గం ఉండదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.
మరో మూడు రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల
ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగానే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఆ మేరకు ఆ పార్టీ సీనియర్ నాయకులు కొందరు ఫెడరల్ ప్రతినిధికి తెలిపారు. మూడు రోజుల క్రితం ఏఐసిసి ప్రత్యేక సమావేశం నిర్వహించి ఏపి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు వారం రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయమైన ఆంధ్రరత్న భవన్‌లో ఏపిసిసి అధ్యక్షురాలు ఎమ్మెల్యే సీట్ల కోసం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులను వరుసగా ఇంటర్వ్యూలు చేశారు. ఈ ఇంటర్వ్యూల్లోనే కొంత స్క్రీనింగ్ జరిగింది. మెరుగైన అభ్యర్థులను కేంద్ర నాయకుల ముందు ఏపిసిసి ఉంచింది. వాళ్లు కొన్ని సూచనలు చేయడంతో పాటు రాష్ట్ర అధ్యక్షురాలికి కూడా అభ్యర్థుల నియామకాల విషయంలో కొంత స్వేచ్ఛ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. శనివారం విశాఖలో నిర్వహించే కాంగ్రెస్ç Üభలో అభ్యర్థుల జాబితా ఎప్పటిలోపు ప్రకటిస్తారనే విషయాన్ని సూచన ప్రాయంగా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.
Next Story