
మీడియాతో మాట్లాడుతున్న సీపీ రవిశంకర్
మా వల్ల దర్యాప్తు ఆలస్యం కాలేదు... విశాఖ సీపీ రవిశంకర్ వివరణ...
విశాఖ పోర్ట్‌లో సీబీఐ సీజ్ చేసిన డ్రగ్స్ కేసులో దర్యాప్తు ఆలస్యం కావడానికి పోలీసులే కారణమంటూ వస్తున్న వార్తలపై సీపీ రవిశంకర్ స్పష్టతనిచ్చారు.
విశాఖ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో సీబీఐ అధికారుల తనిఖీలు పోలీసులు సహకరించకపోవడంతో ఆలస్యం అయ్యాయని వస్తున్న వార్తలపై సీపీ రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు. తమ వల్ల ఎటువంటి ఆలస్యం కాలేదని తేల్చి చెప్పారు. 'విశాఖలో ప్రైవేట్ కంటైనర్ టెర్మినల్‌లో అనుమానిత మాదక ద్రవ్యాల కేస్ పూర్తిగా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. సీబీఐ అభ్యర్థన మేరకు విశాఖ పోలీస్ శాఖ నుండి డాగ్ బృందాన్ని పంపాము. మా వల్ల సోదాలు ఆలస్యం జరిగాయన్న వ్యాఖ్యాలను ఖండిస్తున్నాము. సీబీఐ విధి నిర్వహణకు ఏ విధమైన అడ్డు మా వల్ల కలగలేదు' అని విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ అయ్యనార్ వివరణ ఇచ్చారు.
Next Story