CmRamesh| సీఎం రమేశ్ జీ, ఇలాంటిగిఫ్ట్ ఇవ్వడానికి సిగ్గనిపించడం లేదూ?
x
బీహార్ ఎంపీ సుధామ ప్రసాద్, బీజేపీ ఎంపీ సీఎం రమేష్

CmRamesh| 'సీఎం రమేశ్ జీ, ఇలాంటిగిఫ్ట్ ఇవ్వడానికి సిగ్గనిపించడం లేదూ?'

రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ రమేష్ పై బీహార్ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన గిఫ్ట్ సీపీఐ ఎంల్ ఎంపీ తిప్పి పంపడమే కాకుండా, ఖాటు లేఖ కూడా రాశారు.


మాది ప్రజల పక్షం. కార్మికులకు న్యాయం చేయండి. సాధారణ ప్రయాణికులకు వసతులు మెరుగుపరచండి. అంతేకానీ, ఎంపీలకు బహుమతులు ఇచ్చి నోళ్లు మూయించాలనుకుంటే సాధ్యం కాదని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ ఎంపీ సుధామ ప్రసాద్ హెచ్చరించారు. రైల్వే శాఖపై కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఈ తరహా పద్ధతులు అనైతికం. అవినీతి హద్దులు మీరి ఎంపీల నోరు మెదపకుండా చేస్తుంది" ఈ పప్పులు మా వద్దకు ఉడకవు అని ఆ వామపక్ష ఎంపీ రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు ఘాటు లేఖ రాశారు. తనకు ఇచ్చిన బహుమతులు కూడా తిప్పి పంపించారు. ఈ ఆ మేరకు తన ఎక్స్ (X) ఖాతాలో లేఖ పోస్టు చేశారు.
బీహార్ రాష్ట్రం అరా పార్లమెంట్ స్థానం నుంచి సుధామ ప్రసాద్ ఎంపీగా ఎన్నికయ్యారు. కమ్యూనిస్టులు అంటే ఆదర్శంగానే ఉండాలని ఆయన అర్థం చెప్పారనడంలో సందేహం లేదు.
ఈ విషయంపై శుక్రవారం ఉదయం 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధి ఎంపీ సుధామ ప్రసాద్ ను పలకరించారు. రోజులు గడిచినా ఆయనలో ఆగ్రహం తగ్గినట్లు కనిపించలేదు. ఆయన ఏమన్నారంటే..
"పేదలు మా పార్టీపై ఎన్నో ఆశలు పెట్టుకన్నారు. మిగతా పార్టీలను కాదని నన్ను గెలిపించారు. మా పని వారికి మేలు చేయడమే కదా" అని సీపీఐ ఎంల్ లిబరేషన్ పార్టీ ఎంపీ సుధామ ప్రసాద్ తన బాధ్యతను గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న నాతో పాటు అందరికీ బహుమతులు ఇచ్చారు. "తిరుపతిలో ఎంపీలకు వీటిని అందించారు. అప్పుడు చూసుకోలేదు. తిరిగి బీహార్ వచ్చాక గమనించా. ఒళ్లు మండింది. వెంటనే ఆ బహుమతులు కమిటీ చైర్మన్ సీఎం రమేష్ కు తిప్పి పంపించా" అని ఎంపీ సుధామ ప్రసాద్ వివరించారు. దీనిపై బీజేపీ స్పందన కోసం చూస్తున్నా అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే...
అసలు ఏమి జరిగింది
ఈ ఏడిది అక్టోబర్ 31 వ తేదీ నుంచి నవంబర్ ఏడో తేదీ మధ్య పార్లమెంటరీ రైల్వే స్టాండింగ్ కమిటీ స్టడీ టూర్ నిర్వహించారు. బెంగుళూరు, తిరుపతి నుంచి సీఎం రమేష్ సారధ్యంలోని ఎంపీల కమిటీ హైదరాబాద్ వరకు పర్యటించింది. ఈ కమిటి బెంగళూరు నుంచి తిరుపతికి చేరుకుంది. ఆ సమయంలో గ్రాము బంగారు నాణెం, 100 గ్రాముల వెండి దిమ్మెతో పాటు ఇంకొన్ని బహుమతుల బ్యాగులు అందించారు. ఆ సమయంలో అందులో ఏమున్నదనే విషయం ఎవరికీ తెలియదు. స్వప్రాంతానికి తిరిగి వెళ్లిన తరువాత బహుమతులు పరిశీలించిన సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఎంపీ సుధామ ప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. ఆ తరువాత వాటిని పార్లమెంటరీ స్లాండిండ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ కు తిప్పిపంపడంతో పాటు, ఖాటుగా ఏమని లేఖ రాశారంటే... యథాతధంగా..

టు, సీఎం రమేష్ (ఎంపీ), ఛైర్‌పర్సన్, రైల్వే స్టాండింగ్ కమిటీ,
భారత పార్లమెంట్, ఢిల్లీ
విషయం: RITES మరియు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ జారీ చేసిన బహుమతుల వాపసు.
గౌరవనీయులు సార్.
ముందుగా, 31 అక్టోబర్ మరియు 7 నవంబర్ 2024 మధ్య బెంగుళూరు, తిరుపతి నుండి హైదరాబాద్ వరకు నిర్వహించబడిన అధ్యయన యాత్రకు హాజరయ్యేందుకు స్టాండింగ్ కమిటీ సభ్యుల కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేసినందుకు రైల్వేస్ మరియు భారతీయ రైల్వేల స్టాండింగ్ కమిటీకి నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

నేను ఈ లేఖ రాయడానికి కారణం నైరుతి రైల్వేకు చెందిన వివిధ సంస్థలు ఇచ్చే కొన్ని బహుమతులను స్వీకరించలేకపోవడమే. పార్లమెంటు సభ్యులను, అతిథులను ఆప్యాయత మరియు ఆతిథ్యం కోసం బహుమతులతో స్వాగతించడం ఒక సంప్రదాయమని నేను అర్థం చేసుకున్నాను. పువ్వులు, శాలువాలు, పెయింటింగ్‌లు, కొన్ని జ్ఞాపకాలను సాధారణంగా స్వాగత బహుమతులుగా ఇస్తారు.

అయితే, నాకు బాధ కలిగించింది RITES మరియు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఇచ్చిన బహుమతులు. నిన్న, అర్థరాత్రి RITES మరియు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ వ్యక్తులు నా గదిని సందర్శించి రెండు సంచుల జ్ఞాపికలను బహుకరించారు. నేను రోజు పని చేసి అలసిపోవడంతో, నాకు ఏమి ఇవ్వబడిందో నేను వెంటనే చూడలేదు. తర్వాత రాత్రి నేను గ్రాము బంగారు నాణెం, 100 గ్రాముల వెండి బ్లాక్‌ను వరుసగా RITES మరియు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ద్వారా నాకు అందించినట్లు కనుగొన్నాను. నేను ఆశ్చర్యపోయాను మరియు అలాంటి బహుమతులు ఇచ్చినందుకు భారతీయ రైల్వేలో భాగంగా ప్రజల నైతికత మరియు నైతికత గురించి ప్రశ్నలు లేవనెత్తాను.

రైల్వే భద్రత, చార్జీల పెంపు, సౌకర్యాల లేమి, భారత రైల్వేలు అవమానకరమైన రీతిలో వ్యవహరించడం వంటి అనేక సవాళ్లను ప్రయాణికులు ఎదుర్కొంటున్న తరుణంలో స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఇలాంటి బహుమతులు ఇవ్వడం అనైతికం మాత్రమే కాదు, అవినీతికి హద్దులు మీరి ఎంపీల నోరు మెదపకుండా చేస్తుంది.

సాధారణ ప్రజానీకం, రైల్వే స్టేషన్లలో పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనాలు చెల్లించడం లేదని, కాంట్రాక్టుపై పనిచేయాలని ఒత్తిడి చేసి కాంట్రాక్టర్ల చేతుల్లో వేధింపులకు గురవుతున్నారన్నారు. అదేవిధంగా, సామాన్య ప్రజలు సాధారణంగా మరియు స్లీపర్ కంపార్ట్‌మెంట్లలో గౌరవం లేకుండా ప్రయాణించేలా చేస్తారు. వందేభారత్ నడిపే రైళ్లపై ప్రధానంగా దృష్టి సారించి పేదలు మరియు మధ్యతరగతి వారి కోసం కొత్త రైళ్లు ఏవీ ప్రవేశపెట్టబడలేదు.

అదేవిధంగా, స్టాండింగ్ కమిటీ సమావేశాలు లేదా అధికారిక సమావేశాల కోసం ఫైవ్ స్టార్‌ కాకుండా, సాధారణ వసతిని ఏర్పాటు చేయమని భారతీయ రైల్వే యాజమాన్యానికి సూచనలను పంపవలసిందిగా స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌ని నేను అభ్యర్థిస్తున్నాను. ప్రజాప్రతినిధులుగా నైతికతకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత మనపై ఉంది.

నాకు బహుమతిగా ఇచ్చిన బంగారం, వెండిని కమిటీ సభ్యుల ముందు తిరిగి ఇవ్వాలని ఆశిస్తున్నాను పార్లమెంటు సభ్యుని పట్ల ఈ విధంగా ప్రవర్తించినందుకు నా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను.
మీకు ధన్యవాదములు

సుదామ ప్రసాద్
ఎంపీ


Read More
Next Story