ప్రేమ జంటకు సహకరించిందని, వారు ఇల్లొదిలి పారి పోవడానికి సహకారం అందించిందనే అనుమానంతో మహిళపై దారుణానికి పాల్పడ్డారు.


ఆంధ్రప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఓ స్త్రీ పట్ల అత్యంత అవమానకరంగా వ్యవహరించారు. ఓ ప్రేమ జంట ఇంటి నుంచి వెళ్లి పోవడానికి కారణమంటూ మహిళ జుట్టు కత్తిరించి.. వివస్త్రను చేశారు. తీవ్ర అవమానానికి గురైన ఆ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమానుషమైన ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం మునిమడుగు గ్రామానికి చెందిన అనిల్‌ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకుంటున్నారు. అయితే ఆ యువతకి ఇంకా మైనర్‌ తీరలేదు. మైనర్‌ బాలిక. ఈ క్రమంలో వారం రోజుల క్రితం ఆ ప్రేమికులిద్దరూ ఇల్లొదిలి వెళ్లి పోయారు. ఈ వ్యవహారంలో ఒక మహిళకు సంబంధం ఉందని అమ్మాయి కుటుంబ సభ్యులు ఆమెపై కోపం పెంచుకున్నారు. ప్రేమ వ్యవహారంలోను, ప్రమే జంట ఇల్లొదిలి పారిపోవడంలోను ఆ మహిళ ప్రమేయం ఉందని వారు అనుమానించారు. ఆమె సహకారంతోనే ప్రేమ జంట వెళ్లి పోయిందని ఆమెపై పగ పెంచుకున్నారు. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు ఆ మహిళపై దాడికి పాల్పడ్డారు.
అంతటితో కోపం చల్లారని ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఆ మహిళ పట్ల తీవ్రంగా ప్రవర్తించారు. జుట్టు కత్తిరించడంతో పాటు ఆమెను వివస్త్రను చేశారు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది. బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. తనపై దాడికి పాల్పడటమే కాకుండా తీవ్రంగా అవమానించారని, గ్రామంలో తలెత్తుకుని తిరగలేని పరిస్థితులు సృష్టించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రేమ వ్యవహారంలోనూ.. ఆ ప్రేమ జంట ఊరు వదిలి పారి పోవడంలోను తనకు ఎలాంటి సంబంధం లేదని.. అనవసరంగా తనపై దాడి చేసి ఇబ్బందులకు గురి చేశారని ఫిర్యాదులో పేర్కొంది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరో వైపు ప్రేమ పేరుతో మైనర్‌ బాలికను మోసపూరితంగా లోబరుచుకున్నాడని అనిల్‌పైన పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు మొదలు పెట్టారు. దాడికి పాల్పడిన అమ్మాయి కుటుంబ సభ్యులు, బాధితురాలు అందరూ బంధువులే అని, ఈ ఘటన మీద వారి మధ్య మరస్పర్థలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే మహిళపై దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నారు.


Next Story