మాజీ మంత్రి ఆర్కే రోజా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌లపై తీవ్రంగా స్పందించారు.


సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ఏడేళ్ల బాలిక హత్య దారుణ సంఘటన జరగడం ప్రభుత్వానికే సిగ్గు చేటని వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పుంగనూరులో ఏడేళ్ల బాలిక హత్యపై ఎందుకు స్పందించడం లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌లను నిలదీశారు. దారుణంగా హత్య చేస్తే ప్రభుత్వం ఏమి చేస్తోందని, డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. ప్రభుత్వానికి, పవన్‌ కళ్యాణ్‌లకు వైఎస్‌ఆర్‌సీపీ, జగన్‌పై కక్ష సాధింపు చర్యలపై ఉన్న శ్రద్ధలో కొంత ప్రజల భద్రతపై పెట్టాలన్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రోజా ఇన్‌స్టాలో విడుదల చేశారు. ఇదిప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తన కూతరు కనిపించడం లేదని ఆదివారం రాత్రి నుంచి కనిపించడంలేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు. పోలీసుల అలసత్వం కారణంగా పాప చనిపోయిందని, నాలుగు రోజుల తర్వాత చిన్నారి శవమై తేలిందన్నారు. మదనపల్లిలో ఫైల్స్‌ కాలిపోతే సీఎం చంద్రబాబు హుటాహుటిన డీజీపీని హెలికాఫ్టర్‌ లో పంపించారని, మరి ఏడేళ్ల చిన్నారి చనిపోతే డీజీపీని ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. ముచ్చుమర్రి మైనర్‌ హత్యోదంతంలో నేటికీ మృత దేహం జాడే కనుక్కోలేదని విమర్శించారు.

Next Story